వెనిగర్‌తో బరువు కూడా తగ్గొచ్చు..కానీ డైలీ తీసుకుంటే డేంజరే.!

-

వెనిగర్‌ను వంటల్లో కొన్ని బ్యూటీ టిప్స్‌లో వాడుతుంటారు. చాలామంది వెనిగర్‌ను పెద్దగా వాడరు కూడా.! కానీ వెనిగర్‌ పడాల్సిన వంటల్లో వెనిగర్‌ వాడితే టేస్టే వేరు. అయితే యాపిల్‌ సైడ్ వెనిగర్ డైలీ తగు మోతాదులో తీసుకోవడం వల్ల మంచి లాభాలు ఉన్నాయట. బరువు తగ్గడానికి ఇది బాగా హెల్ప్‌ అవుతుంది అంటున్నారు నిపుణులు. క్యాన్సర్‌ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. యాపిల్‌ సైడ్ వెనిగర్‌ ప్రయోజనాలు, ఎక్కువగా వాడితే వచ్చే దుష్ప్రాభావాలు ఏంటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.!

ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ప్రయోజనాలు..

బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది

బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది

కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది

హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేడడంలో ఉపయోగపడుతుంది

చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది

సరైన మార్గంలో తీసుకున్నప్పుడు మాత్రమే మీరు యాపిల్‌ సైడ్ వెనిగర్‌ ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరు. నిపుణుల సూచనలను పాటించకపోవడం కొన్ని ప్రాణాంతక ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది. అవేంటంటే..

జీర్ణ సమస్యలను ప్రేరేపిస్తుంది: యాపిల్ సైడర్ వెనిగర్ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. అందుకే ఆపిల్ సైడర్ వెనిగర్‌ను క్రమం తప్పకుండా తాగే వ్యక్తులు కడుపులో అసౌకర్యం లేదా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గ్యాస్, ఉబ్బరం మొదలైనవి ఉండవచ్చు.

మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకున్నట్లయితే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న రోగులు ACVని తీసుకునే ముందు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను మారుస్తుంది. మోతాదులో తీసుకుంటే చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ప్రతి వెనిగర్‌లో ఆమ్లం ఉంటుంది. ఇది పంటిపై చెడు ప్రభావాలను కలిగిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ విషయంలో కూడా అంతే. యాపిల్ సైడర్ వెనిగర్ ను ఎక్కువ తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. యాపిల్ సైడర్ వెనిగర్ pH స్థాయిలు దాదాపు 2 లేదా 3 ఉంటాయి. అందుకే ACV పలుచన లేకుండా తీసుకుంటే గొంతు చికాకు కలిగించే అవకాశం ఉంది.

అధిక మొత్తంలో ACV తీసుకోవడం వల్ల పొటాషియం స్థాయిలు తగ్గుతాయి. ఇది హైపోకలేమియాకు కారణమవుతుంది. వాటిని విరిగిపోయేలా చేస్తుంది. ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఆరోగ్యానికి మంచిదే అయినా మోతాదులో తీసుకోవాలి. కొంత మంది నీటిలో పలచగా చేసి పానీయంగా తీసుకుంటారు. ఇటువంటి సందర్భాలలో ఒక పెద్ద గ్లాసు నీటిలో కలిపి రోజుకు 510 మి.లీ వరకు మాత్రమే తీసుకోవాలి.

ప్రయోజనాలు బాగున్నప్పటికీ..సరైన మోతాదులో తీసుకున్నప్పుడే ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. లాభాలు బాగున్నాయి కదా అని ఎక్కువగా తాగితే పైన చెప్పిన సమస్యలు ఎదుర్కోక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news