దేవాలయాల అధికారులకు బిగ్ షాక్.. ఆ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు !

-

దేవదాయ శాఖ అధికారులకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ నెల 15వ తేదీలోగా మొత్తంగా ఉన్న స్టాట్యూటరీ డ్యూస్ చెల్లించాలని దేవాలయాల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 6-A, 6-B కేటగిరిలకు చెందిన 1776 దేవాలయాలు రూ. 312 కోట్ల మేర స్టాట్యూటరీ డ్యూస్ బకాయిలు పడ్డట్టు అంచనా వేస్తున్నారు. స్టాట్యూటరీ డ్యూస్ చెల్లించకుంటే 16వ తేదీన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరికలు చేశారు.

బకాయిల చెల్లింపులకు అవసరమైన నిధుల్లేవంటూ గగ్గోలు పెడుతోన్నారు దేవాలయాల అధికారులు. సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స్టాట్యూటరీ బకాయిలను ఒకేసారి చెల్లించమనడం సమంజసం కాదంటున్నారు ఈవోలు. అవసరమైతే బకాయిల చెల్లింపుల కోసం ఫిక్సడ్ డిపాజిట్ ఖాతాలను రద్దు చేసేందుకు దేవదాయ శాఖ పర్మిషన్ ఇచ్చింది. ఫిక్సడ్ డిపాజిట్లు తీసేస్తే జీతాల చెల్లింపులు మొదలుకుని.. దేవాలయాల నిర్వహణ భారంగా మారుతుందంటూ దేవాలయాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news