ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తున్నారా…? అయితే ఈ సమస్యలు తప్పవు..!

-

లేవగానే భూదేవికి దండం పెట్టుకో.. లేదా నచ్చిన దేవుళ్ళకి దండం పెట్టుకుని లేస్తే రోజంతా హ్యాపీగా ఉంటారు అని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరు నిద్ర లేవగానే చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని రోజుని ప్రారంభిస్తున్నారు. దీనికి వయసు తో సంబంధం లేదు. చిన్నారులు, పెద్దలు కూడా ఇదే పరిస్థితి. పైగా అరనిమిషం చేతిలో ఫోను లేకపోతే ఎదో అయిపోయినట్టు ప్రవర్తిస్తారు. ప్రతీ ఒక్కరు అవసరానికి మించి వాడుతూ బానిసలైపోతున్నారు. నిద్ర లేవగానే సెల్ ఫోన్ చేతిలో పెట్టుకోవడం వల్ల అనేక సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే ఈ అలవాటుని తగ్గించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడటం వల్ల కలిగే నష్టాలు ఏమిటి…? ఈ విషయం లోకి వస్తే… రాత్రి ఎంతో ప్రశాంతంగా నిద్రపోయి ఒక్కసారిగా నిద్రలేచి చూస్తే… స్మార్ట్ సెల్ ఫోన్ నుంచి వచ్చే కిరణాలు నేరుగా మన కళ్ళ లోకి పడటం వల్ల రోజంతా తీవ్రమైన ఒత్తిడి, తలంతా ఎంతో భారంగా అనిపిస్తుంది. దీనితో రోజు అంతా కూడా ఎదో ఇబ్బందికరంగా ఉంటుంది. మన ఫోన్ కి వాచ్చే మెసేజెస్ వల్ల కూడా మన మూడ్ చెడిపోయే ఛాన్స్ కూడా ఉంది.

దీని వల్ల రోజంతా అదే విషయం గురించి ఆలోచించడం వల్ల మన మెదడు పని తీరు కూడా తగ్గిపోతుంది. కనుక ఈ అలవాటు ఉంటే మానుకోవడం మంచిది. ఉదయాన్నే లేచి భక్తి గీతాలు, ఇష్టమైన పాటలు వినడం, తోట పనులు చెయ్యడం లేదా నచ్చిన బుక్స్ చదవడం చేస్తే రోజు అంతా కూడా బాగుంటుంది. ప్రశాంతంగా అన్ని పనులు పూర్తవుతాయి ఏ చింత ఉండదు.

 

Read more RELATED
Recommended to you

Latest news