జనసేన బీజేపీ మధ్య స్నేహం దారితప్పుతోందా ?

-

తిరుపతి సీటు దక్కించుకోవాలని జనసేన క్యాడర్‌ పట్టుబడుతుంటే.. అలాంటి ఆలోచనే వద్దని తిరుపతిలో పోటీ చేసేది తామేనని బీజేపీ తెగేసి చెప్పేస్తోంది. అటు క్యాడర్‌కు నచ్చజెప్పలేక..ఇటు బీజేపీని ఒప్పించలేక..జనసేనాని సతమతమౌతున్నాడు. ఒక్కసీటు విషయంలోనే ఈ పీఠముడి ఉంటే సాధరణ ఎన్నికల్లో..సీట్లు పొత్తు పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు రెండు పార్టీల శ్రేణుల్లో చర్చకు కారణమైంది.

తెలంగాణలోని దుబ్బాకలో ఎలా అయితే ఊహించని ఫలితాలు సృష్టించామో..తిరుపతిలోనూ అలాంటి ఫలితాన్నే రాబట్టి రాబోయే రోజుల్లో అధికార పీఠానికి దగ్గరవ్వాలన్నది బీజేపీ ప్లాన్‌. జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయనేది అందరికీ తెలిసిందే అయినా..తొలి రోజు నుంచీ తిరుపతిలో నిలబడేది తామేనని..జనసేన మద్దతు మాత్రమే ఉంటుందని కమలనాథులు కరాఖండిగా చెబుతున్నారు.

జనసేన వాదన మాత్రం మరోలా ఉంది. అసెంబ్లీలో ఉన్న ఒక్కసీటు దక్కకుండా పోయింది. బీజేపీ సహకారంతో తిరుపతి ఎంపీ సీటైనా కొడితే.. రాష్ట్రంలో పరువు దక్కించుకోవడంతో పాటు ఉనికి చాటుకున్నట్టుంటుందని జనసేన భావిస్తోంది. స్థానిక నేతలు కూడా ఇదే విషయాన్ని పవన్‌ కల్యాణ్‌కు గట్టిగా చెబుతున్నారు. బీజేపీ ఒత్తిడికి తలొగ్గొద్దని ఆరు నూరైనా తిరుపతిలో పోటి చేయాల్సిందే అంటున్నారు.

తిరుపతి సీటు నాకిస్తే ఏడు నియోజకవర్గాల్లో నేనే తిరిగి ప్రచారం చేస్తా అని పవన్ హామీ ఇస్తున్నారు. అందులో తిరుపతి పార్లమెంట్ పరిధిలో సామాజిక సమీకరణలు కూడా జనసేనకు కలిసివస్తాయని లెక్కలేసి చూపుతున్నారు. అందుకే నయానో భయానో తిరుపతి సీటు దక్కించుకోవాలనుకుంటున్నారు జనసేనాని. ఒకవేళ తిరుపతి సీటు బీజేపీకే వదులుకోవాల్సి వస్తే… రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తులో భాగంగా ఇప్పుడే పెద్ద డిమాండ్‌ పెట్టి హామీ తీసుకోవాలని కూడా జనసేన యోచిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news