వానాకాలంలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకునే ఆహారంలో ఈ తప్పులు చెయ్యద్దు..!

-

వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకని మంచి ఆరోగ్యకరమైన ఆహారం food తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యానికి హాని చేసే ఆహారం తీసుకోవడం వల్ల విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.

కనుక తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. అయితే ఈ రోజు వానా కాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. అల్పాహారం, భోజనం మరియు రాత్రి డిన్నర్ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది చూసేద్దాం. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం పూర్తిగా చూసేయండి.

వానా కాలంలో ఆహారం తీసుకునేటప్పుడు ఈ పదార్థాలు తీసుకుంటే మంచిది. కొన్ని కొన్ని సార్లు అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడ ప్రిఫర్ చేసిన వాటిని తీసుకుంటే బెస్ట్.

అల్పాహారం:

వానా కాలంలో ఎక్కువగా వేయించినవి, రోస్ట్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోండి. పోహా, ఉప్మా, ఇడ్లీ, పరాటా లాంటివి బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు.

మధ్యాహ్నం భోజనం:

ఇక మధ్యాహ్నం భోజనం గురించి చూస్తే..ఈ కాలంలో ఎక్కువగా జీర్ణ వ్యవస్థ బలహీనంగా మారి పోతుంది. కాబట్టి లైట్ గా తీసుకుంటే మంచిది. మధ్యాహ్నం పూట వేయించిన పదార్థాలు కంటే కూడా కాయగూరలు తీసుకుంటే మంచిది. వీటితో పాటుగా మీరు బట్టర్ మిల్క్ లేదా పెరుగు కూడా తీసుకుంటే మేలు కలుగుతుంది.

డిన్నర్:

ఇక డిన్నర్ గురించి చూస్తే.. డిన్నర్ మరింత లైట్ గా ఉండేటట్లు చూసుకోండి. సూప్ లాంటివి తీసుకుంటే మీకు మేలు కలుగుతుంది. దానితో పాటుగా రోటి, కిచిడి లాంటివి కూడా తీసుకోవచ్చు. రాత్రి నిద్ర పోయేటప్పుడు పాలల్లో పసుపు వేసుకుని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఇలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని వానా కాలంలో ఆరోగ్యంగా ఉండండి లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news