బరువు తగ్గాలనుకునేవారు చేసే మొదటి పని, ఆహారాన్ని తగ్గించడం. ఆహారం తక్కువగా తింటే బరువు తగ్గుతారని అనుకుంటారు. అది కొద్దిగా నిజమే కావచ్చు. కానీ అలా వెయిట్ లాస్ ( Weight Loss ) ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. చాలామంది ఆహారం తక్కువ తీసుకున్నా కూడా బరువు తగ్గకుండా, ఇంకా పెరుగుతూ ఉంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆహారం తక్కువగా తీసుకున్నా కూడా బరువు పెరగడానికి గల కారణాలను పరిశీలిద్దాం.
మొదటగా, ఆహారం తక్కువగా తీసుకోవాలనుకునేవారు ఒక పూట భోజనం మానేస్తుంటారు. అది తప్పు. రోజువారి దినచర్యలో ఏ సమయంలో ఆహారం తీసుకుంటారో అదే సమయంలో ఆహారం తీసుకోవాలి. అలా కాకుండా ఒక పూట భోజనం మానేస్తే బరువు పెరుగుతారు. అవును, ఎక్కువ సేపు ఆకలితో ఉండడం వల్ల తొందరగా బరువు పెరుగుతారు. అందుకే ఆహారం తినే సమయంలో తేలికపాటి ఆహారాలను చేర్చుకుంటే బెటర్.
రెండవది నిద్ర, నిద్రపోవడన్ని అందరూ ఇష్టపడతారు. ఐతే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల బలహీనంగా మారతారు. ఇది ఊబకాయాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది. రోజుకి 8గంటల నిద్ర బాగా సరిపోతుంది.
మూడవది కాఫీ, లేవగానే కాఫీ తాగే అలవాటున్నవారు తొందరగా బరువు తగ్గరు. ఎందుకంటే కాఫీ కారణంగా శరీరంలో అసిడిటీ పెరుగుతుంది. అలాగే తీపి పదార్థం చక్కెర కారణంగా బరువు పెరుగుతారు. కాబట్టి పొద్దున్న లేవగానే గోరు వెచ్చని నీళ్ళు తాగితే మంచిది.
నాలుగవది శారీరక శ్రమ, చాలామంది దీన్ని విస్మరిస్తారు. ఎన్ని చేసినా శారీరక శ్రమ చేయకపోతే బరువు పెరుగుతూ ఉంటారు. రోజూ కూర్చుని అదే పనిగా పనిచేయడం కన్నా లేచి నిలబడి అటూ ఇటూ తిరగండి.