పాస్పోర్ట్ ని పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక నుండి ఈజీగా పాస్పోర్ట్ ని పొందొచ్చు. పైగా ఏ కష్టం కూడా ఉండదు. ఎందుకంటే ఇక నుండి పాస్పోర్ట్ ని పోస్ట్ ఆఫిస్ passport at post office లో పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..
పాస్పోర్ట్ జారీ ప్రక్రియను సులభతరం చేయడానికి మినిస్టరీ ఆఫ్ ఎక్స్టెర్నల్ ఎఫైర్స్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్ నమోదు చేయడానికి మరియు పాస్‌పోర్ట్ దరఖాస్తులను అందించడానికి దేశవ్యాప్తంగా మొత్తం 424 పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇండియా పోస్ట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ రిసిప్ట్ మరియు ఒరిజినల్ డాకుమెంట్స్ తో సహా దరఖాస్తుదారులందరూ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంకి (పిఎస్‌కె) తప్పక వెళ్ళాలి అని పాస్‌పోర్ట్ విభాగ అధికారి చెప్పారు. అయితే మొదట ఖచ్చితంగా అవసరమైన డాక్యుమెంట్స్ ని సిద్ధం చేసుకోవాలి.
పోస్టాఫీస్‌లో పాస్‌పోర్ట్ దరఖాస్తు కోసం అవసరమయ్యే డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డు
- ఓటరు ID కార్డు
- దృవీకరణ పత్రం
- బర్త్ సర్టిఫికెట్
- పాఠశాల టీసీ
- డ్రైవింగ్ లైసెన్స్
- పాన్ కార్డ్
పోస్టాఫీస్‌లో పాస్‌పోర్ట్ అప్లై చేసుకోవడానికి విధానం
స్టెప్ 1: పాస్‌పోర్ట్ సేవ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. passportindia.gov.in.
స్టెప్ 2: ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫార్మ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చెయ్యండి.
స్టెప్ 3: ఇప్పుడు మీరు మీకు దగ్గరలో వున్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించడానికి అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చెయ్యండి.
స్టెప్ 4: నెక్స్ట్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం వున్న పోస్టాఫీస్ కి మీ అప్లికేషన్ ప్రింట్ రసీదు మరియు ఒరిజినల్ డాక్యుమెంట్‌లతో పాటు వెళ్ళండి.
స్టెప్ 5: వెరిఫికేషన్ సక్సెస్ అయ్యాక మీ పాస్‌పోర్ట్ 7 నుండి 14 పనిదినాల్లోపు జారీ చేస్తారు.