టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

-

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా? ఈ అలవాటు మీకు కూడా ఉందా? ఉంటే వెంటనే మానుకోవాల్సిన అవసరం చాలా ఉంది. టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళడం వలన కలిగే అనర్థాలను తెలుసుకుందాం.

phone
phone

సూక్ష్మజీవులు

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళడం వలన హానికరక సూక్ష్మజీవులైన సాల్మోనెల్లా, ఈ కోలి మొదలగు వ్యాప్తి పెరుగుతుంది. దానివల్ల మీకు ఇన్ఫెక్షన్ కలగవచ్చు. అవి ఫోన్ ద్వారా మీ శరీరంలోకి ప్రవేశించి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

మూలశంఖ వ్యాధి వచ్చే అవకాశం

టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నప్పుడు మీరు కావాల్సిన దానికంటే ఎక్కువ సమయం కూర్చుంటారు. అది పురీష నాళం మీద ఒత్తిడి తీసుకువస్తుంది. దానివల్ల మూలశంఖ వ్యాధి వచ్చే అవకాసం ఉంటుంది.

జీర్ణాశయాంతర సమస్యలు

పురీష నాళం మీద ఒత్తిడి పెరుగుతున్నప్పుడు జీర్ణాశయాంతర సమస్యలు వస్తాయి. ఆల్రెడీ సమస్య ఉంటే గనక మరింత తీవ్రరూపం దాల్చుతుంది.

సమయం వృధా

పొద్దున్న లేవగానే టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళడం వల్ల ఎక్కువ సమయం వృధా అవుతుంది. కావాల్సిన దానికంటే ఎక్కువ సేపు కూర్చుంటారు కాబట్టి ఆ టైమ్ అంతా వృధా అయినట్టే.

వ్యసనంగా మారుతుంది

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళడం వల్ల వ్యసనం పెరుగుతుంది. చిన్న చిన్న నోటిఫికేషన్ వచ్చినా ఏమొచ్చిందో చూడాలన్న కోరిక పెరుగుతుంది. ఇది మాటి మాటికీ జరుగుతుంటే మీరు ఫోన్ కి బానిస అయ్యారని చెప్పుకోవచ్చు.

టాయిలెట్ లో ఫోన్ పోగొట్టుకోవడం

చాలామందికి ఇలాగే జరుగుతుంది. టాయిలెట్ లో ఫోన్ పాడేసుకుంటారు. దానివల్ల అనవసర ఖర్చు పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news