చలికాలంలో తప్పక ఈ ఆహారపదార్ధాలని తీసుకోండి..!

చలికాలంలో జలుబు, దగ్గు మొదలైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు తమ యొక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అందుకని ఆరోగ్య నిపుణులు చలికాలంలో కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి చెప్పారు.

వీటిని తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది. చాలా రకాల పండ్లు మరియు కూరగాయలలో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మరి ఆలస్యం ఎందుకు ఆ ఆహార పదార్ధాల గురించి ఇప్పుడు మనం చూసేద్దాం.

అల్లం:

ప్రతి రోజు వల్ల అల్లం తీసుకుంటే మంచిది. టీ లో కూడా మీరు అల్లాన్ని ఉపయోగించవచ్చు. అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి మొదలైన సమస్యలను తొలగిస్తుంది.

బఠానీ :

ఇవి మనకి చలికాలంలో బాగా దొరుకుతాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ వంటి సమస్యలు తొలగిస్తాయి. అజీర్తి సమస్యలను కూడా తొలగిస్తుంది.

విటమిన్ సి:

విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ద్రాక్ష, కమలా మొదలైన వాటిలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. అలానే జీర్ణ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు.

తేనె:

తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని కూడా తేనె పెంపొందిస్తుంది. అలానే ఇతర ప్రయోజనాలు కూడా తేనెతో మనం పొందొచ్చు.