వైసిపి సీనియర్ నేత, రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతల పై తన సోషల్ మీడియా వేదికగా అనే విమర్శలు సంధిస్తూ ఉంటారు విజయసాయిరెడ్డి. ముఖ్యంగా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసి… సెటైర్లు పిలుస్తూ ఉంటారు విజయసాయిరెడ్డి. అయితే తాజాగా మరోసారి చంద్రబాబు పై విమర్శలు సంధించారు విజయసాయిరెడ్డి.
అధికారంలో ఉన్నన్నాళ్లు పొరుగు రాష్ట్రాల సిఎంలతో ఉప్పు-నిప్పులా చంద్రబాబు వ్యవహరించాడని… తను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి వాళ్లెవరికి అడ్రెస్సులు లేవనీ, చివరకు మోదీ, అమిత్ షాలు కూడా జూనియర్లేనని హేళన చేసేవాడని చురకలు అంటించారు విజయ సాయి రెడ్డి. జగన్ గారు వచ్చాక పక్క రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణం నెలకొల్పారన్నారు.
ఇక అంతకు ముందు త”మ ఉనికి కోసం దేవుడినీ వాడుకున్నారు విపక్ష నేతలు. అప్పుడు విగ్రహాలపై దాడులు. ఇప్పుడు విద్యార్థులపై దాడులు. కట్టుకథలతో రెచ్చగొడుతున్నారు.1999లో ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పోస్తుల భర్తీ అవసరం లేదంటూ జీవో ఇచ్చి వాటిని నిర్వీర్యం చేసిన ఘనుడే ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నాడు.” అంటూ ట్వీట్ చేశారు విజయ సాయి రెడ్డి.
అధికారంలో ఉన్నన్నాళ్లు పొరుగు రాష్ట్రాల సిఎంలతో ఉప్పు-నిప్పులా వ్యవహరించాడు చంద్రబాబు. తను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి వాళ్లెవరికి అడ్రెస్సులు లేవనీ, చివరకు మోదీ, అమిత్ షాలు కూడా జూనియర్లేనని హేళన చేసేవాడు. జగన్ గారు వచ్చాక పక్క రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణం నెలకొల్పారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 11, 2021