మహిళలూ బొట్టు పెట్టుకోండి.. ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు..!

-

ఈరోజుల్లో చాలా మంది బొట్టు పెట్టుకోవడం మానేశారు కానీ మన అమ్మలు అమ్మమ్మలు చూస్తే ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని కనపడుతూ ఉంటారు. బొట్టు వలన అందమే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. మన దేశ సనాతన సాంప్రదాయపు విశిష్ట లక్షణం బొట్టు. పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంటే నిండుగా కనపడుతూ ఉంటారు మన అమ్మలు అమ్మమ్మలు కానీ కాలం మారిపోయింది ఈ మధ్యకాలంలో చాలా మంది బొట్టు పెట్టుకోవడం లేదు. నిజానికి బొట్టు పెట్టుకుంటే ముఖం వెలిగిపోతుంది. ఒక ప్రత్యేకమైన కళ కనబడుతూ ఉంటుంది.

 

అందం కోసమే కాదు బొట్టు పెట్టుకుని ఉంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆజ్ఞ చక్రం అని మనం బొట్టు పెట్టుకునే ప్రదేశం ని అంటారు. యోగ ప్రకారం చూసుకున్నట్లయితే శరీరంలో ఆరవ అత్యంత శక్తివంతమైన చక్రం ఇది. బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ పాయింట్ ని రోజుకి చాలా సార్లు ఒత్తుతూ ఉంటాము. మనిషి శరీరంలో వేల సంఖ్యలో నాడులు ఉంటాయి వీటిని అన్నిటికీ కేంద్ర స్థానం ఆజ్ఞ చక్రం. కనుబొమ్మల మధ్య ఇది ఉంటుంది.

ఈ స్థానంలో నుంచి ప్రాణ శక్తి కిరణాలు ప్రసారం అవుతాయి కళ్ళు, మెదడు, పిట్యుటరి కి సంబంధించిన నాడులు ఉంటాయి ఆజ్ఞ చక్రం వద్ద ఒత్తిడి మనం చేయి పెట్టినప్పుడు పడుతుంది. అలా చేయడం వలన నాడులు ఉత్తేజమవుతాయి. పురుషులు బొట్టు పెట్టుకోలేరు కనుక ఆ స్థానంలో కుంకుమ పెట్టుకున్న ఆ పాయింట్ ని ప్రెస్ చేసినా కూడా ప్రయోజనాలను పొందొచ్చు. బొట్టు పెట్టుకుంటే వినికిడి శక్తి మెరుగుపడుతుంది డిప్రెషన్ తగ్గుతుంది చర్మం యవ్వనంగా కనబడుతుంది. సైనస్ ని క్లియర్ చేస్తుంది తలనొప్పి కూడా ఉండదు ఒత్తిడితో వచ్చే మైగ్రేన్ తలనొప్పి కూడా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news