ఈ రోజుల్లో వెన్నునొప్పి సర్వసాధారణం అయిపోయింది. చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువసేపు కదలకుండా ఒకే చోట కూర్చోవటం, నడుము మీద అధిక బరువు పడేవిధంగా పనిచేయడం వంటి కారణాల వల్ల నడుము నొప్పి వస్తోంది. అయితే నడుము నొప్పి నుండి ఉపశమనం పొందడానికి కొన్ని యోగాసనాలు ఉపయోగపడతాయి.
భుజంగాసనం:
బోర్లా పడుకుని రెండు అరచేతులను భూమిపైన ఆనించి కేవలం నడుము భాగం వరకు పైకి లేపి, గాలిలోకి తలను లేపాలి. ఇలా 30 సెకండ్లు ఉంచాలి. ఆ తర్వాత మళ్లీ ఆరుసార్లు రిపీట్ చేయాలి. దీనివల్ల నడుము నొప్పి తగ్గుతుంది.
సేతు బంధాసనం:
వెల్లకిలా పడుకుని మోకాళ్ళ వద్ద కాళ్ళను వంచి, కాళ్ళ మీద బ్యాలెన్స్ వేసి, రెండు చేతులను భూమికి ఆనించి ఛాతి నుండి మోకాళ్ళ భాగం వరకు పైకి లేపాలి. ఈ స్థితిలో మెడ భాగం భూమిని తాకి ఉంటుంది.
విపరీత కారణి:
ఈ యోగాసనాన్ని చేయడానికి మీరు గోడ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. గోడకు కాళ్లను ఆనించి.. నడుము భాగాన్ని రెండు అరచేతులతో పట్టుకోవాలి. ఈ ఆసనం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. యోగా కొత్తగా మొదలుపెట్టేవారు ఈ ఆసనాన్ని ఎక్కువసేపు వేయలేరు. క్రమక్రమంగా పెంచుతూ ఐదు నిమిషాల వరకు వెళ్ళవచ్చు.
ఇవి మాత్రమే కాకుండా రోజువారి జీవితంలో కొన్ని మార్పు చేసుకోవడం ద్వారా నడుము నొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోకూడదు. అలాగే నిల్చకూడదు. నడుమును వంచి ఎక్కువసేపు పనిచేయకూడదు. బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నడుము మీద భారం పడకుండా బరువులను ఎత్తాలి.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.