ఖాళీ కడుపుతో ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి.

-

ధ్యానం అంటే ఒకే పనిమీద దృష్టి నిలపడం. అది ఎలాంటిదైనా కావచ్చు. ఒకపని మీద మీ పూర్తి దృష్టి నిలిపితే ఆ పనిలో శిఖరాగ్రాలను చేరుకుంటారు. ఐతే ప్రస్తుతం సాంప్రదాయ ధ్యానం గురించి తెలుసుకుందాం. రోజులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి శ్వాస మీద ధ్యాస నిలపడం అనేది కొద్దిసేపైనా చేయాలి. ధ్యానం ఎలా చేయాలనే దానిపై చాలామందిలో సందేహాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో ధ్యానం చేయడం మంచిదని చెబుతుంటారు.

అది నిజంగా మంచిదేనా? దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

ధ్యానం వల్ల కొత్త శక్తి వస్తుంది. దాన్ని శరీరం సరిగ్గా వాడుకోవాలంటే ఖాళీ కడుపుతో ధ్యానం చేయాలి. కడుపు నిండుగా ఉన్నప్పుడు ఒక ఆలోచన మీద దృష్టి నిలపడం కష్టం అవుతుంది. ఎందుకంటే జీర్ణాశయంలో కదలికలు శరీరాన్ని ఒకేవైపు దృష్టి నిలపనీయవు. అందువల్ల కడుపులో ఏమీ లేకుండా ఉన్నప్పుడే ధ్యానం చేయాలి.

కడుపు ఖాళీగా ఉండాలన్నప్పుడు ధ్యానం చేయమన్నారు కదా అని ఉదయమే చేయాల్సిన పనిలేదు. అందరికీ ఉదయం కుదరకపోవచ్చు. కాబట్టి ఆహారం తిన్నాక 3లేదా 4గంటల తర్వాత చేస్తే బాగుంటుంది. ఒకవేళ మధ్యలో టీ తాగినట్లయితే కనీసం 20నిమిషాలు లేదా 40నిమిషాలు వేచి ఉండండి.

ధ్యానం చేసేటపుడు పాటించాల్సిన కొన్ని నియమాలు

పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చోండి. ఆ ప్రదేశం ప్రశాంతంగా ఉండాలి.

మీరు కూర్చునే భంగిమ సౌకర్యవంతంగా ఉండాలి. లేదంటే దృష్టి మొత్తం దాని మీదకే మళ్ళుతుంది.

నెమ్మదిగా కళ్ళు మూసుకుని ధ్యానం మొదలు పెట్టండి. శ్వాస మీద ధ్యాస ఉంచండి. లేదంటే ఒకే ఆలోచన చేసినా సరిపోతుంది. కానీ అది కొద్దిగా కష్టం కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టండి.

Read more RELATED
Recommended to you

Latest news