తేనెతో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!

-

పూర్వకాలంలో అయితే సహజంగా తేనె లభించేది కాబట్టి దానికి పోషక విలువలు కూడా ఎక్కువగా లభించేవి. కానీ ఇటీవల కాలంలో తేనెలో కూడా బెల్లం కలిపిన నీళ్లు కలుపుతూ దానిని కూడా కలుషితం చేయిస్తున్నారు. స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఇకపోతే ప్రతిరోజు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అంటే తేనెను కంపల్సరిగా తినాలి అని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఇటీవల కాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అందుకే తేనెలో విటమిన్ సి లభించడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అధిక బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా బరువు తగ్గే సమయంలో తేనెను తీసుకోవడంలో పలు పొరపాట్లు చేస్తున్నారు. ఆ పొరపాట్లు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందట. ఇక చాలామంది వేడివేడి పదార్థాలలో తేనె కలిపి తాగుతూ ఉంటారు . ముఖ్యంగా కొంతమంది వేడి టీలో తేనె వేసుకొని తాగుతారు. ఇలా వేడి పదార్థాలతో తేనె కలిపి తీసుకోకూడదట. కావాలంటే గోరువెచ్చగా ఉన్న పదార్థాలతో తేనె కలిపి తీసుకుంటే ప్రయోజనాలు కలుగుతాయి.

ఒకవేళ మీరు వేడిగా ఉన్నప్పుడు తేనె కలిపి తాగితే తేనెలో ఉండే మైనం విషం గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడి పదార్థాలతో తేనె కలిపి తీసుకోకూడదు. ముఖ్యంగా గోరువెచ్చని నీటిలో తేనె కలిపి ఉదయం సమయంలో తీసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గడమే కాకుండా హుషారుగా కూడా ఉంటారు. ఇక తేనె వల్ల లభించే అన్ని పోషకాలు లభించాలి అంటే ఆర్గానిక్ తేనె మాత్రమే ఉపయోగించడం మంచిది. మార్కెట్లో దొరికే తేనే కల్తీ అయి ఉండవచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త వహిస్తే మరీ మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news