మే 21 శనివారం రాశి ఫలాలు..ఆ రాశుల వారికి అన్నీ శుభాలే..

-

శనివారం కొన్ని రాశుల వారికి అనుకొని ధన లాభం రావడం లేదా మొండి పనులు పూర్తీ అవ్వడం, కుటుంబ వ్యవహారాలు సంతోషాన్ని కలిగించేలా ఉండటం జరుగుతుంది.ఈ రోజు మరి ఏ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..

మేషం: కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.. దగ్గర బంధువుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి..ఈరోజు ఇద్దరు బ్రాహ్మణులకు ఉలవలు దానం చేయడం మంచిది.

వృషభం: ఆర్థిక వ్యవహారాలలో మందకోడిగా సాగుతాయి.. అనుకోని ప్రయాణాలు శ్రమను కలిగిస్తాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో శిరోభాధలు తప్పవు వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది..ఈరోజు కొత్త పనులను వాయిదా వేయడం మంచిది.

మిథునం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకున్న సమయానికి ధనం అందక రుణ ఒత్తిడి ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు స్వల్పముగా లాభిస్తాయి, నిరుద్యోగులు ప్రయత్నం మీద అవకాశములు అందుకుంటారు.ఈరోజు ఏదైనా ఆలొచించి చేయడం చాలా మంచిది.

కర్కాటకం: ఈరోజు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది.వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు..శుభకార్యాలలో పాల్గొంటారు.. మంచి పనులు చేయడం మంచిది.

సింహం: సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో కార్యజయం. కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది నూతన వాహనయోగం ఉన్నది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి..విందువినోదాల లో పాల్గొంటారు..

కన్య: ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. ఎటువంటి కారణాలు లేకుండా బంధువులతో తగాదాలు కలుగుతాయి. సంతాన అనారోగ్య విషయాలు బాధిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కోపం అదుపులో ఉంచడం మంచిది..దైవదర్శనాలు చేస్తారు. శని దేవుడిని ప్రార్దించాలి.

తుల: కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. బంధు మిత్రుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు.. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి..

వృశ్చికం: కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగములలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. స్ధిరాస్తి లాభం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విహార యాత్రలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి.

ధనస్సు: కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు.అధిక శ్రమతోకాని పనులు పూర్తి కావు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు ఉద్యోగులకు అదనపు పనిభారం కలుగుతుంది..చిన్ననాటి ఫ్రెండ్స్ తో కొత్త చికాకులు పెరుగుతాయి. జగ్రత్తగా ఉండటం మంచిది.

మకరం: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కావలసిన బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.  ఉద్యోగులకు జీతాల విషయంలో శుభవార్తలు వింటారు.ఈరోజు ముఖ్యమైన పనులు నెరవెరతాయి.నువ్వులు,శనగలు ఎవరికైనా దానం చెయ్యడం మంచిది.

కుంభం: చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు ధన పరంగా ఇబ్బంది కలుగుతుంది.ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.ఈరోజు ఆలొచించి ఏదైనా మాట్లాడటం మంచిది.కొత్త వ్యక్తుల పరిచయం ఇబ్బందులను కలిగిస్తుంది.

మీనం: ఆర్ధికవ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. అవసరానికి అందరి సహాయం అందుతుంది.పాత మిత్రులతో కలిసి కొన్ని విషయాలు గూర్చి చర్చలు చేస్తారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సహకరంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.ఈరోజు ఏది చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. దైవదర్శనాలు, కొత్త ప్రయాణాలు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news