టీచర్ చేసిన పనికి ఒక లైక్ వేసుకోవాల్సిందే..!

-

ఒకప్పుడు ఆడవాళ్ళు వంటి, ఇల్లు పని అని మాత్రం అనే వాళ్ళు..కానీ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నారు..పట్టుదల, సాధించాలనే కృషి వుంటే ఏదైనా సాధిస్తారని నిరూపిస్తారు..తాజాగా మరో టీచర్ కూడా తనలొని టాలెంట్ ను అందరికి తెలిసేలా చేసింది..ఒకవైపు పిల్లలకు పాఠాలు చెబుతూనే మరో వైపు తన లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేసింది.ఇప్పుడు సక్సెస్ అయ్యింది అందరికి ఆదర్సంగా నిలిచింది.టీచర్ సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణానికి చెందిన దొడ్లపాటి విజయ, టీచర్గా కొనసాగుతూనే నిరంతరం సాధన చేస్తూ మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడల్లో ప్రతిభ చాటుతున్నారు. చిన్నతనంలో క్రీడల పట్ల ఇష్టం పెంచుకున్న ఆమె..అప్పటి పరిస్థితుల దృష్ట్యా..అటుగా అడుగులు వేయలేకపోయారు. ఇంతలో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన విజయ.. తన చిన్ననాటి అభిరుచిని కొనసాగిస్తూ మాస్టర్స్ అథ్లెటిక్స్ లో మంచి విజయాలు సాధిస్తున్నారు..

తెలంగాణ సహా హరియాణా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో నిర్వహించిన రాష్ట్ర, జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని పసిడి, వెండి పతకాలతో పాటు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. గత మే నెలలో కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున బరిలో నిలిచిన విజయ.. మంచి ప్రతిభ కనబర్చారు. హర్డిల్స్ 400 మీటర్ల(జంపింగ్ హుమ్) విభాగంలో బంగారు పతకం..2000 మీటర్ల పరుగు విభాగములో వెండి పతకం సాధించారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడల్లో రాణిస్తున్న టీచర్ విజయను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం అభినందించారు. జిల్లా, మండల స్థాయిలోనూ పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు విజయ టీచర్‌ను ప్రశంసించి సన్మానించారు..

అంతేకాదు ఈ ఏడాది ఆగస్టు – సెప్టెంబర్ నెలలో జపాన్ దేశంలో జరుగనున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. ఫిన్లాండ్ దేశంలో అక్టోబర్ – నవంబర్ నెలలో జరగనున్న ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో భారత్ తరపున విజయ ప్రాతినిధ్యం వహించనున్నారు.అథ్లెటిక్ విభాగంలోనూ హర్డిల్స్ , లాంగ్ జంప్, షాట్ పుట్, పరుగు పందెంలో ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రభుత్వ సహకారం వుంటే తన లక్ష్యాన్ని సాదిస్తానని విజయ అన్నారు.. గ్రేట్ ఉమెన్..

Read more RELATED
Recommended to you

Latest news