ప్రధానమంత్రి కార్యాలయం వచ్చే ఒకటిన్నర సంవత్సర కాలంలో 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు జారీ చేస్తూ నుంచి ప్రకటన వెలువడడం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో.. ఈ ప్రకటనపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎనిమిదేళ్ల కిందట ఇలాగే హామీలిచ్చారని, అప్పుడు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారన్నారు రాహుల్ గాంధీ. ఇప్పుడు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పడం కూడా అదే కోవలోకి వస్తుందని విమర్శించారు రాహుల్ గాంధీ. ఇది తప్పుడు హామీలు ఇచ్చే ప్రభుత్వం కాదని, మహా తప్పుడు హామీలు ఇచ్చే ప్రభుత్వం అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీ ఉద్యోగాల సృష్టిలో నిపుణుడు కాదు… ఉద్యోగాలపై వార్తలు సృష్టించడంలో నిపుణుడు అని ఎద్దేవా చేశారు రాహుల్. ఇదిలా ఉంటే.. ఇండియన్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో రాహుల్, సోనియా గాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసింది. అయితే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నేడు రెండో రోజు రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయంలో విచారణకు హజరయ్యారు.