తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే మరో కొద్ది సేపట్లో హైదరాబాద్‌లో భారీ వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. నైరుతి రుతుపవనాల ఎంట్రీతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు మంగళవారం సాయంత్రం హెచ్చరించారు. దాంతో మరో గంటలో హైదరాబాద్ సిటీలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. జంట నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.
రాష్ట్రంలో నైరుతు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో చాలా చోట్లా మొస్తలు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదేవిధంగా తాజాగా హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్నదని హెచ్చరించింది. నగరంలో మూడు రోజులపాటు అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.^