అందరి ముందు మాట్లాడాలంటే భయమా…? అయితే ఇది మీకోసం…!

Join Our Community
follow manalokam on social media

చాలా మంది కింద చాలా బాగా మాట్లాడతారు. కానీ ఒక్కసారి అందరి ముందు నిలబడి మాట్లాడాలంటే చేతులు వణికి పోతాయి. అలానే పేనిక్ అయిపోతుంటారు. ఇది చాలా మందిలో ఉండే కామన్ సమస్య. మాట్లాడేటప్పుడు వాయిస్ వణికిపోవడం.. చేతులు, కాళ్లు వణికిపోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటి నుంచి మీరు బయటపడి సింపుల్ గా అందరి ముందు మాట్లాడాలంటే మీరు ఈ పద్ధతిని అనుసరించండి. దీనితో వీరు ఎంతో ఈజీగా మాట్లాడొచ్చు.

public speaking

మీ టాపిక్ తెలుసుకోండి:

మీరు ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో ఆ టాపిక్ కి సంబంధించి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎటువంటి ప్రశ్నలు ఆడియన్స్ అడగవచ్చు అనేది కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలి.

అన్నిటినీ ప్లాన్ చేసుకోండి :

ఎంత సేపు మాట్లాడాలి..? ఏం మాట్లాడాలి…? ఇలాంటి విషయాలు ఒక చిన్న కాగితం మీద రాసుకోండి. ప్రిపేర్ గా ఉండి మీరు మాట్లాడడానికి వెళ్ళండి.

ప్రాక్టీస్ చేయడం :

ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు ప్రజెంట్ చేసుకోగలరు. కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి మీరు వెళితే మీకు భయం ఉండదు.

మీ విజయాన్ని మీరు ఊహించుకోండి:

నెగిటివిటీని మైండ్ లో నుంచి తీసేసి గెలిస్తే ఎలా ఉంటుంది అనే విషయాలపై కాసేపు ఊహించుకోండి. దీనితో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి:

గట్టిగా ఊపిరి తీసుకోండి. అలానే మీరు స్టేజ్ ఎక్కి ముందు ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుని అప్పుడు మాట్లాడటం మొదలు పెట్టండి.

మీ మాటల పై మీ ఫోకస్ పెట్టండి:

అక్కడ ఉండే ఆడియన్స్ మీద కాకుండా మీరు మీ ప్రజెంటేషన్ మీద ఫోకస్ పెడితే మీరు మంచిగా ప్రెజెంట్ చేయడానికి వీలవుతుంది. ఇలా చేయడం వల్ల మీకు భయం ఉండదు ఎంతో ఈజీగా మాట్లాడగలరు.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...