13 ఏళ్లకే చెఫ్ అయ్యాడు.. లక్షల్లో సంపాదన..!

ఒకప్పుడు అంటే.. పిల్లలకు 15 ఏళ్లు వచ్చే వరకూ.. సరిగ్గా ఫోన్ వాడటం కూడా వచ్చేది కాదు.. 90s కిడ్స్ ఫోన్ మొదటిసారి.. యూస్ చేసింది ఇంటర్ లోనో, డిగ్రీలోనే అయి ఉంటుంది. కానీ ఇప్పుడు చిన్నప్పుడు నుంచే పిల్లలకు ఫోన్ కు అలవాటు పడిపోయారు. వాళ్లకు అన్నం పెట్టాలన్నా, నిద్రపుచ్చాలన్నా ఫోన్ ఉండాల్సిందే.. వాళ్లే..ఫోన్ ఓపెన్ చేసి.. కావాల్సింది పెట్టుకుని చూస్తున్నారు. కానీ ఇక్కడితే ఆగిపోకుండా.. ఓ కుర్రాడు 13 ఏళ్లకే ఓ ఛానల్ పెట్టి.. దానికి సీఈఓ అయ్యాడు. అంతేనా. చెఫ్ లా మారి.. యాంకరింగ్ చేస్తూ.. లక్షల్లో సంపాదిస్తున్నాడు.

ఆ కుర్రాడి పేరు ఒమరి మెక్‌క్వీన్. వయసు 13 ఏళ్లు. ఇదివరకు ఇంగ్లండ్‌లో ఉండేవాడు. ఇప్పుడు బ్రిటన్‌లో ఉంటున్నాడు. ఒమరి… తన పేరుతో కంటే… యంగెస్ట్ చెఫ్‌గానే గుర్తింపు పొందాడు. చెఫ్‌లు చాలా మంది ఉంటారు. కానీ ఒమరికి ఇంత గుర్తింపు రావడానికి కారణం.. తను వేగాన్ చెఫ్. అందులోనూ యంగెస్ట్ వేగాన్ చెఫ్. పూర్తిగా వందశాతం శాఖాహార వంటల్ని ఎలా వండాలో టీవీలో, యూట్యూబ్‌లో చూపిస్తున్నాడు.

8 ఏళ్ల వయసులోనే ఇన్‌స్టాగ్రామ్‌లో కుకింగ్ అకౌంట్ ప్రారంభించాడు. వేగాన్ చెఫ్ అయ్యాడు. అలాగే యూట్యూబ్‌లో ఒమరి గోస్ వైల్డ్ అనే ఛానెల్ తెరిచాడు. వాటిలో వేగాన్ రెసిపీలు, టిప్స్ షేర్ చేస్తాడు. ఒమరికి ఇన్‌స్టాగ్రామ్‌లో 28వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా… యూట్యూబ్‌లో 9వేల మందికి పైగా ఉన్నారు.

బ్రిటన్‌లో యంగెస్ట్ టీవీ చెఫ్‌గా అవార్డ్ పొందాడు. డిపాలీషియస్ (Dipalicious) అనే వేగాన్ కంపెనీని ప్రారంభించి దానికి సీఈఓ అయ్యాడు. ఈ కంపెనీ మొక్కల ఆధారిత ఆహారం, భోజనం, డిప్స్, జ్యూస్ వంటివి విక్రయిస్తుంది..త్వరలో మరొకటి ప్రారంభించాలి అనుకుంటున్నట్లు ఒమరి అంటున్నాడు.

ఒమరి తను తయారుచేసే వేగాన్ వంటలపై పుస్తకాలు కూడా రిలీజ్ చేస్తున్నాడు. అలా రచయితగా కూడా మనోడు దూసుకెళ్తున్నాడు. మూడు అవార్డులు కూడా గెలుచుకున్నాడంటే.. ఈ కుర్రాడు ఎంత టాలెంటెడో మీరే చూడండి. ఒమరి రకరకాల పనుల వల్ల స్కూల్‌కి వెళ్లడం మానేశాడు. అతని తల్లిదండ్రులు… ఓ ప్రైవేట్ స్కూల్ ద్వారా… ఇంటి నుంచే ఆన్‌లైన్ క్లాసులు చెప్పిస్తున్నారు.

ఇలా ఒమరి.. అటు టీవీ చెఫ్‌గా, ఇటు కంపెనీ సీఈఓగా, వంటల రచయితగా, యూట్యూబర్‌గా, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఇలా అన్ని రకాలుగా తన టాలెంట్ చూపిస్తున్నాడు. ఫలితంగా అతనికి భారీగా సంపాదన వస్తోంది. కానీ ఒమరీ తల్లీ మాత్రం… ఇది డబ్బు కోసం మాత్రమే కాదు.. జంతువులకు హాని చేయకుండా.. అందరూ ఆహారం తినాలన్నదే తన కొడుకు ఉద్దేశంగా చెప్తుంది.!

-Triveni Buskarowthu