రూటు మార్చిన హోమ్లీ బ్యూటీ..కీర్తి సురేశ్ బోల్డ్ అటెంప్ట్!

-

అలనాటి మహానటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన అందాల నటి కీర్తి సురేశ్. ‘మహానటి’ ఫిల్మ్ తో నేషనల్ అవార్డు పొందిన ఈ సుందరి..తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. ప్రజెంట్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ప్రతీ విషయాన్ని ఎప్పడికప్పుడు షేర్ చేస్తుంటుంది ఈ ముద్దు గుమ్మ.

లేటెస్ట్ గా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పర్పుల్ రంగు లాంగ్ డ్రెస్ లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘హాట్ క్యూటీ,వెరీ నైస్’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జోడీగా కీర్తి సురేశ్ నటించిన నటించిన ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో కీర్తి అందంతో పాటు అభినయం కనబరిచి ప్రేక్షకులను అలరించిందని మహేశ్ బాబు అభిమానులు చెప్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేశ్..మెగాస్టార్ చిరంజీవి ‘‘ భోళా శంకర్’’ ఫిల్మ్ తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news