అనవసర దిగులు.. అపజయాలకు నెలవు.. అర్థం చేసుకుంటే విజయం మీదే.

-

మనసులో దిగులు ఉన్నప్పుడు మరోదానికి చోటుండదు. కనీసం దూరం నుండి వేరే ఆలోచన చేయలేరు. అందుకే చాలా తొందరగా దిగులుని దూరం చేసుకోవాలి. కొన్ని కొన్ని సార్లు దిగులుగా ఉండడమే బాగుందన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు. అది ఇంకా ప్రమాదకరం. అందుకే దిగులుని దూరం చేసుకుని జీవితంలో కొత్త వెలుగు వైపు పయనించాలి. దిగులుని పొగొట్టుకోవడానికి మిమ్మల్ని మీరెలా సిద్ధం చేసుకోవాలంటే,

గందరగోళాన్ని చెదరగొట్టండి

ఆలోచనల్లో గానీ, హౌస్ లోగానీ గందరగోళాన్ని చెదరగొట్టండి. ఇల్లంతా చిందరవందర వస్తువులతో నిండి ఉంటే దిగులు కాస్త చిరాగ్గా మారి అక్కడ నుండి కనిపించని స్థాయిలోకి బీపీ పెరిగి ఏం చేయాలో అర్థం కాకుండా పోతుంది. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఆలోచనలని కూడా గందరగోళం చేసుకోవద్దు.

మీకు నచ్చిన పని మొదలు పెట్టండి.

మీకు బాగా నచ్చిన పనులు చేయండి. గార్డెనింగ్, రాయడం, సినిమాలు చూడడం ఇలా మీకిష్టమైన వాటిలో కొంతకాలం గడపండి.

దిగులు గురించి వాక్యాలు రాయండి

మనసులో ఉన్నప్పుడు చాలా పెద్దగా అనిపించిన చాలా విషయాలు పేపర్ మీదకి రాగానే చిన్నగా కనిపిస్తాయి. అందుకే ఏ విషయానికి మీరు దిగులు పడుతున్నారో ఆ విషయాలు ఒక పేపర్ మీద రాయండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఆ విషయానికి అంతలా బాధపడాల్సిన అవసరం ఉందా అని.

దరిద్రమైన పరిస్థితిని ఊహించండి

మీరెందుకు దిగులు పడుతున్నారో, ఆ దిగులుకి కారణమైన పరిస్థితుల వల్ల మీ పరిస్థితి ఎలా మారుతుందన్న విషయంలో వరస్ట్ కేస్ ఊహించండి. అంతకంటే ఇంకా ఏమీ కాదన్న స్థితికి మీరు వస్తే ఏమవుతుందని ఆలోచించండి. ఏమీ కాదని అర్థం అవుతుంది. గుండె తేలికవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news