బ‌హుదూర‌పు బాట‌సారి ఈ పోస్టు మాస్ట‌ర్‌.. కొండ‌కోన‌లు దాటి ఒక్క‌రికి ఫించ‌న్ ఇచ్చేందు

-

సాధారణంగా పింఛను బ్యాంకు అకౌంట్‌లో పడ్డప్పుడు వృద్ధులు లేదా వికలాంగులు బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లి తీసుకుంటుడటం కామనే. అయితే, మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ స్టోరీలో ప్రత్యేక పరిస్థితుల రిత్యా పోస్టు మాస్టర్ ( Post Master ) కేవలం కేవలం ఒక్కరి కోసం కొండలు ఎక్కి మరీ బహుదూరం పయనించి పెన్షన్ ఇచ్చి వస్తున్నాడు. ఇంతకీ ఆయన ఎవరు? ఎక్కడ ఇలా జరుగుతుందంటే..

post Master | పోస్టు మాస్టర్
post Master | పోస్టు మాస్టర్

తమిళనాడులోని తిరునెల్వెలి నగరానికి సమీపంలోని కలక్కాడ్ ముండం టైగర్ రిజర్వ్‌లో అడవిలో నివసించే ఓ వృద్ధురాలికి పింఛను ఇచ్చేందుకు పోస్ట్ మాస్టర్ కష్టాలు పడాల్సి వస్తోంది. అసలేం జరిగిందంటే.. ఈ టైగర్ రిజర్వ్ ప్రాంతాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ వి.విష్ణు ఒక రోజు సందర్శించారు. ఈ క్రమంలోనే రిజర్వ్‌లోని ఇంజికుళి గిరిజన గ్రామంలో పర్యటించారు. అక్కడ జనాలతో ఆయన ముచ్చటించిన క్రమంలో నూటపది ఏళ్ల వృద్ధురాలు ఒకామె కలెక్టర్‌తో మాట్లాడింది. తాను వృద్ధాప్యంలో ఉన్నందున నెలవారీ పింఛను కోసం రావడం ఇబ్బంది అవుతుందని పేర్కొంది. ఆమె సమస్య విన్న కలెక్టర్ వెంటనే పరిష్కార మార్గం సూచించాడు. మహిళలకు నెలవారీ పింఛను తన వద్దకు వచ్చేట్లు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.

అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీసు ద్వారా పింఛను పంపాలని ఆఫీసర్లు అనుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలోని అప్పర్ డ్యామ్ బ్రాంచ్‌కు చెందిన పోస్టుమాస్టర్ ఎస్. క్రిస్తురాజాకు ఈ పని అప్పగించారు. ప్రతీ నెల ఈయన రిజర్వ్‌లోని గిరిజన గ్రామానికి వెళ్లి సదరు మహిళకు వృద్ధాప్య పింఛను రూ.1,000 అందిస్తున్నారు. తాను విధినిర్వహణలో భాగంగా ఈ పని చేస్తున్నట్లు పేర్కొంటున్నాడు క్రిస్తురాజా. అటవీ ప్రాంతంలో నది గుండా ప్రయాణించి ఆ తర్వాత కొండలపైన ట్రెక్కింగ్ చేసి తన విధి నిర్వహిస్తున్నానని గర్వంగా చెప్తున్నాడు క్రిస్తురాజా. ఈ విషయాలను తెలుసుకుని నెటిజన్లు ఆయన పట్ల ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news