పరిపూర్ణత వచ్చే దాకా వేచి చూడకుండా మొదలెడితేనే పరిపూర్ణత సాధించవచ్చు.

-

ఏదైనా కొత్త పని మొదలెట్టాలనుకున్నప్పుడు అందులో నిష్టాతులం కావాల్సిన అవసరం లేదు. నిష్ణాతులు అయితేనే పని మొదలెట్టాలన్న ఆలోచన కరెక్ట్ కాదు. ప్రస్తుతం రోజులు మారిపోతున్నాయి. పరిపూర్ణత రావడానికి టైమ్ పడుతుంది. అలా అని టైమ్ వచ్చేదాకా ఊరికే కూర్చుంటే ఎప్పటికీ పరిపూర్ణత సాధించలేదు. ముందుగా మొదలు పెట్టాలి. నీ కలలు సాధించడానికి, అనుకున్నవన్నీ చేయడానికి మొదలెట్టాలి. కొందరంటారు మనకు రాని విషయాల్లో వేలు పెట్టకూడదని. వేలు పెట్టకుండా విషయాలేవీ రావని గుర్తుంచుకోవాలి.

అందరూ అన్ని విషయాల్లో పరిపూర్ణత సాధించలేరు. మనకి కావాల్సిన వాటిలోనైనా పరిపూర్ణత సాధించడానికి ప్రయత్నించాలి. అబ్బా మనవల్ల కాదులే, అయినా ఇది మనకోసం కాదు, పూర్తిగా రాని పని చేయడం అవసరమా అన్న ఆలోచనలతో మిమ్మల్ని మీరు వెనక్కి నెట్టివేసుకుంటూ ఉన్నంత కాలం బద్దకస్తుల్లాగే మిగిలిపోతారు. అలా కాకుండా మీకు రానిపనే చేయడం మొదలెట్టండి. రాకపోతేనే కదా అందులో మెళకువలు నేర్చుకోగలిగేది. అప్పుడే కదా అందులో పరిపూర్ణత సాధించేది. అవతలి వారి మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగినపుడే మీరనుకున్నది సాధించవచ్చు.

ఈ వయసులో ఇది మొదలెట్టడం అవసరమా అన్న వాదనలు మీకు వినిపించవచ్చు. ఈ వయసు దాకా మీరు దాన్ని నేర్చుకోవడంలో ఎందుకు వాయిదా వేసారో ఒక్కసారి గుర్తుంచుకోండి. దానివెనక ఉన్న కారణం కేవలం బద్దకమే అయితే ఎంత దరిద్రంగా ఉంటుందో ఆలోచించండి. బద్దకం వల్ల మీరనుకున్నది సాధించలేకపోతున్నారంటే ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోండి. అందుకే ఇప్పుడే కదలండి. కలల్ని సాధించండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచండి. అందుకే పరిపూర్ణత వచ్చేదాకా ఎదురుచూడకండి. ఇప్పుడే పనిలోకి దిగిపోండి.

Read more RELATED
Recommended to you

Latest news