ఆమె కృషి వల్ల ఆదివాసి ఉత్పత్తులు ఆన్ లైన్ లో..

-

మీరేప్పుడైన గిరిజన ప్రాంతాలకు వెళ్లినట్లైతే.. అక్కడ వారు వాడే పరికరాలు, తయారు చేసేవి మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. వాళ్లు వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తారు. కానీ వాటిని బయట ప్రపంచానికి తెలియజేసేందుకు వారి దగ్గర సరైనా మార్గాలు లేక.. ఎవరో దళారుల ద్వారా.. తక్కువ ధరకే వారి ఉత్పత్తులను అమ్మేస్తారు.. వాళ్లు వాటిని బయట మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముతూ లాభాలు గడిస్తారు. దాదాపు అన్ని గిరిజన ప్రాంతాల్లో ఇదే జరుగుతుంది. కానీ ఓ మహిళ కృషి వల్ల ఏకంగా.. ఆదివాసీల ఉత్పత్తులు ఆన్ లైన్ లో అమ్మకానికి రెడీ అయ్యాయి.
ఆమె పేరు కావ్యా సక్సేనా. మానవ వనరుల విభాగంలో ఎంబీఏ చేసిన కావ్యాది రాజస్థాన్‌లోని జైపుర్‌. ఇండియన్‌ ఆయిల్‌లో ఏడేళ్లూ, తర్వాత ఆతిథ్య రంగంలో మూడేళ్లూ విధులు నిర్వహించింది. పల్లె జీవనమంటే ఆమెకెంతో ఇష్టం. దాంతో దిల్లీ వదిలి ఒడిశాలోని ఆదివాసీ గ్రామానికి మకాం మార్చింది. కానీ కొవిడ్‌ మొదటి లాక్‌డౌన్‌ సమయంలో గుడ్‌గావ్‌లోని తన ఫ్లాట్‌కు పరిమితమైంది. ప్రయాణాల మీద ఆంక్షల తీసేయగానే ఉద్యోగానికి సెలవు పెట్టి దేశవ్యాప్త పర్యటనకు బయలుదేరింది.
గ్రామీణ భారతం ప్రత్యేకతలు ప్రపంచానికి చెప్పాలనేది ఆ పర్యటన ముఖ్య ఉద్దేశం. దీనికి మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆర్థిక సాయం చేసింది. కారులో తిరుగుతూ పర్యటన విశేషాల్ని సోషల్‌ మీడియాలో పంచుకునేది. ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఒడిశాలోని కొరాపుట్‌ ప్రాంతానికి 2021 జులైలో వెళ్లి అక్కడో గ్రామంలో ఉంటోంది. ఆమె ఉండే ప్రాంతంలో నాణ్యమైన పసుపు దొరుకుతుంది. వాటితో సబ్బులు తయారుచేసి అమ్మిస్తోంది. దీంతో ఒక గ్రామం మొత్తం ఉపాధి పొందుతున్నారు.
మరో గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంది. అక్కడ ప్రత్యేకమైన గడ్డిని పెంచుతున్న 55 మంది మహిళలకు కావ్య చేయూతనిస్తోంది. ఇంతేనా.. దేశవ్యాప్తంగా ఉండే ఆదివాసీలు వెదురు, ఆకులు, గడ్డితో చేసే బుట్టలూ, సంచులూ, టోపీలూ, నవ్వారు, సంప్రదాయ దుస్తులు, వారి ఆభరణాలు… మొదలైన ఉత్పత్తుల్ని ‘క్రాఫ్ట్‌పోట్లీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మార్కెట్‌ చేస్తోంది. కొన్ని మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో గ్రామీణ వాణిజ్యం పైన కావ్య పాఠాలూ చెబుతుంది.
అరుణాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ ప్రభుత్వాలతో కలిసి చేతివృత్తులవారి ఉత్పత్తుల్ని మార్కెటింగ్‌ కోసం కృషి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news