ఒక అడవిలో నది పక్కన పేదవాడు, ధనవంతుడు ఉండేవారు. ధనవంతుడికి పేదవాడంటే అసహ్యంగా ఉండేది. పేదవాడు అడవిలోకి వెళ్ళి, ప్రశాంతంగా కూర్చునేవాడు. అక్కడ ఒకానిక రాతి సింహం ఉండేది. ఆ రాతి సింహం దగ్గర కూర్చున్న పేదవాడు, సింహం నోట్లో తాను తెచ్చుకున్న ఆహారాన్ని పెట్టేవాడు. అలా ఒకసారి అన్నం పెడుతుండగా రాతి సింహం మాటలు వినిపించాయి. ఒక్కసారిగా షాకయిన పేదవాడు, మాటలు సింహం నోటి నుండి వస్తున్నాయని గ్రహించాడు.
సింహం ఇలా అంది. ఇంతవరకు ఎవరూ నాకు అన్నం పెట్టలేదు. నువ్వొక్కడివే నాకు అన్నం పెట్టావు. రేపు వచ్చేటపుడు సూర్యుడు ఉదయించక ముందే ఇక్కడికి రా. నీకు కావాల్సింది నా నోట్లో దొరుకుతుందని చెప్పింది. సింహం చెప్పినట్టే సూర్యుడు ఉదయించకముందే పేదవాడు వచ్చాడు. సింహం నోట్లో చేయి పెట్టి చూసేసరి అతనికి అన్ని బంగారు నాణేలు కనిపించాయి. సూర్యుడు ఉదయించేసరికి బంగారు నాణేలన్నీ తీసుకుని, రాతి సింహానికి దన్యవాదాలు తెలిపి వెళ్ళిపోయాడు.
పేదవాడు ధనవంతుడిగా మారడం చూసిన ధనికుడు ఇదెలా జరిగిందని అడిగాడు. దానికి పేదవాడు జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ధనికుడు కూడా అదే విధంగా రాతి సింహానికి ఆహారం పెట్టడంతో రాతి సింహం మాట్లాడి, పేదవాడికి చెప్పిన విషయాన్నే చెప్పింది. అప్పుడు ఉదయం పూట వచ్చిన ధనికుడు బంగారాన్ని తీసుకుంటూ ఉన్నాడు. కానీ సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా బంగారాన్ని తీస్తున్నాడు. వెంటనే అప్పటి వరకూ తెరిచి ఉన్న సింహం నోరు మూసుకుపోయింది. దాన్లో ఉన్న ధనికుడు చచ్చిపోయాడు.
అందుకే అత్యాశ పనికి రాదు. డేర్ టు డూ మోటివేషన్ ఆధారంగా..