ఘర్ కె కుల్చె తో తల్లికొడుకు లక్షల్లో సంపాదన..!

ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారాల ద్వారా సక్సెస్ అవుతున్నారు. నిజానికి అనుకున్నది సాధించాలంటే కష్టపడితే సరిపోతుంది. అలానే వాళ్ళ పై వాళ్ళకి నమ్మకం ఉండాలి. అలా కనుక జరిగిందంటే చక్కగా అనుకున్నది మనం సాధించొచ్చు. అయితే మనం అనుకున్నది సాధించడానికి కష్ట పడుతున్న వేళలో ఏదో ఒక ఇబ్బంది వస్తుంటుంది.

 

దానిని తట్టుకుని ముందుకు వెళితే కచ్చితంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. ఒక తల్లి కొడుకు కూడా ఇలానే వాళ్ళ గమ్యాన్ని చేరుకున్నారు. నిజానికి వాళ్ళ సక్సస్ ని చూస్తే మీరు మెచ్చుకుంటారు. మరి ఇక వాళ్ళ స్టోరీని చూస్తే గౌరవ్ మరియు తన తల్లి సునీల ఆహార రంగంలో వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకున్నారు.

అనుకున్నట్టుగానే బిజినెస్ మొదలు పెట్టి సక్సెస్ ని అందుకున్నారు. దేనిలోనైనా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అటువంటపుడు వెనకడుగు వేయలేదు. వీళ్లు కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు. ఢిల్లీలో ఈ తల్లి కొడుకు చోలే కుల్చా అని ఒక ఆహార పదార్థాలు తయారీ మొదలుపెట్టారు. ఇప్పుడు నిజంగా వీళ్ళ యొక్క వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది.

చోలే కుల్చా అని చెప్తే చాలు ఈ తల్లీకొడుకులు తయారు చేసేదే అందరికీ గుర్తొస్తోంది. గౌరవ 2016లో రియల్ ఎస్టేట్ రంగంలో పని చేశాడు ఆ తర్వాత ఆహార రంగం వైపు వెళ్లాలని అనుకున్నాడు. అయితే కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలని అనుకుని తన తల్లి సునీల తో పాటు దీనిని ప్రారంభించాడు. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆహార పదార్థాల కి కావాల్సిన తయారీ పదార్థాలు మొదలు ప్రతి ఒక్క దాని పై కూడా దృష్టి బాగా పెడుతూ ఉంటారు.

18 రకాల కుల్చాలు మరియు 24 రకాల కాంబినేషన్ వంటకాలను వీళ్ళు తయారు చేస్తున్నారు. చక్కగా రుచితో పాటు నాణ్యత కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు. దీనిని మొదలు పెట్టి మొదటి రోజే వెయ్యి మంది కస్టమర్లను వీళ్ళ వ్యాపారం ఆకర్షించింది. నెలకు రెండు లక్షల ఆదాయం వస్తోంది. ఏడాదిలోపు ఏడు లక్షలకు చేరుకున్నాయి లాభాలు. ఇలా లక్షల లాభాలను సంపాదిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే కచ్చితంగా సక్సెస్ అయినందుకు వచ్చు.