స్ఫూర్తి: కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని నిరూపించిన ముగ్గురు అమ్మాయిలు.. వీళ్ళ సక్సెస్ ఎందరికో ఆదర్శం..!

నిజంగా మనం పడిన కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. అలానే మనం కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళితే ఖచ్చితంగా విషయం సాధించొచ్చు. అలా విజయాన్ని సాధించారు ఈ ముగ్గురమ్మాయిలు. మరి ఆ ముగ్గురమ్మాయిలు ఎలా విజయం సాధించారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఒక అద్దె ఇంట్లో వీళ్లు వ్యాపారం మూడేళ్ల కిందట మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళ వ్యాపారంతో నెలకి 25 లక్షలు సంపాదిస్తున్నారు.

డిగ్రీ పూర్తయిన తర్వాత ఈ ముగ్గురు అక్క చెల్లెలు సొంతంగా వ్యాపారంని మొదలు పెట్టాలనుకున్నారు. కేరళకు చెందిన ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లు ఆహారపదార్థాలను అమ్మాలని అనుకున్నారు. అయితే ఇంగువ వ్యాపారం చేస్తే బాగుంటుందని వీళ్ళు అనుకున్నారు. ఇంగువని మనం వంటల్లో వాడుతూ ఉంటాము. అలానే మందుల్లో కూడా దీనిని వాడతారు. ఇలా ఇంగువ వ్యాపారంతో వీళ్ళు చక్కగా సంపాదిస్తున్నారు. ఈ వ్యాపారం చేస్తూ వంటకు అవసరమయ్యే 30 రకాల దినుసులు వీళ్ళు బిజినెస్ చేయడం మొదలుపెట్టారు.

వీళ్ళ తయారీ యూనిట్ ఎర్నాకులం లో ఉంది. అయితే నాణ్యత ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇబ్బందులు లేవు. వ్యాపారంలో చక్కగా దూసుకు వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న గదిలో వీళ్ళు వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పుడు యాభై లక్షల విలువగల మిషన్స్ తో బిజినెస్ నడుస్తోంది. కొత్తిమీర పొడి, పసుపు, కారం, చికెన్ మసాలా ఇలా చాలా ప్రొడక్ట్స్ చేస్తున్నారు. వీళ్ళ బ్రాండ్ ని అంతర్జాతీయ బ్రాండ్ గా మార్చాలని అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు.