స్ఫూర్తి: మగువలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏది..? నిజంగా వీరిని స్ఫూర్తిగా తీసుకుంటే ఎవరైనా సక్సస్ అవ్వచ్చు…!

-

నిజానికి ఎవరైనా కష్టపడి దేని కోసమైనా శ్రమిస్తే కచ్చితంగా సక్సెస్ అవ్వొచ్చు. అది మగవారైనా ఆడవారు అయినా సరే. ముఖ్యంగా మహిళలు పట్టుపట్టారు అంటే దానిని సాధించే వరకు కూడా శ్రమిస్తూనే ఉంటారు. ప్రతీ ఒక్కరు కూడా కష్టాన్ని నమ్ముకుని మంచి గా ముందుకు వెళుతూ ఉంటే అనుకున్నది సాధిస్తారు. ఈ మహిళలు దానికి ఉదాహరణ.

 

పెద్దపల్లి జిల్లా కి చెందిన వనిత జ్యోతి గ్రామైక్య సంఘం సభ్యులతో కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకు ద్వారా లోన్ తీసుకుని చిరు ధాన్యాల తో బిస్కెట్లు ఇతర తిను బండారాలను తయారు చేయాలని అనుకున్నారు. ఇంకేముంది అనుకున్నది సాధించాలని ఈ మహిళలు ఉడుంపట్టు పట్టారు. కొద్ది రోజుల్లోనే వీళ్ళ వ్యాపారం బాగా సాగింది.

40 కిలోల పదార్థాలను ఈ మహిళలు ప్రతి రోజు తయారు చేస్తూ మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ మహిళలు వీరి యొక్క తినుబండారాల కి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కాలేశ్వరం, గోదావరిఖని, పెద్దపల్లి మరియు ఇతర ప్రాంతాల లో గిరాకి మొదలయ్యింది. నాణ్యంగా వీళ్ళ ఉత్పత్తులు ఉన్నాయి. దీనితో కలెక్టర్ సంగీత సత్యనారాయణ 80 వేల ఆర్థిక సహాయం కూడా చేసి ఉత్పత్తుల్ని పెంచమని చెప్పారు.

జిల్లాలో ఇంకా మార్కెటింగ్ కోసం ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. ఈ మహిళలు ఆడవాళ్లు తలుచుకుంటే తప్పకుండా సాధిస్తారు అని రుజువు చేశారు. స్వయం శక్తి తో ఎదిగి తామేంటో నలుగురికి చూపిస్తున్నారు. మిగిలిన ఆడవాళ్ళకి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజంగా వీళ్ళు పడే శ్రమ ని తప్పక మెచ్చుకుని తీరాలి ఇలా మహిళలు రాణిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news