భయాన్ని జయించడానికి కావాల్సిన శక్తి ఎలా వస్తుందో తెలిపే కథ..

Join Our Community
follow manalokam on social media

ఏ పని చేయాలన్నా భయపడేవాళ్ళు ఎప్పటికీ ముందుకు వెళ్ళరు. అందుకే ప్రపంచంలో ధనవంతులందరూ తెలివైన వాళ్ళు కాకపోయినా ధైర్యవంతులుగా ఉన్నారు. నిజానికి ధైర్య వంతులే ధనవంతులుగా మారతారు. ఐతే పని చేయడానికి భయపడే ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక కథ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఒకానొక సమయంలో ఒక యుద్ధ వీరుడు గురువు దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. గురువు శిష్యునికి ఈ విధంగా చెబుతున్నాడు. యుద్ధంలో గెలవాలంటే భయాన్ని గెలవాలి. అంటే ముందు భయంతో యుద్ధం చేయాలి. దానికి విద్యార్థి నేనలా చేయలేను అని చెబుతాడు. అపుడు గురువు లేదు, ముందు భయంతో యుద్ధం చెయ్ అని పంపిస్తాడు. విద్యార్థి భయపడుతూనే భయంతో యుద్ధంతో చేయడానికి ముందుకు వచ్చాడు.

ఇద్దరూ చెరో పక్కమీద ఉన్నారు. ఒక పక్క భయం ఉంది. మరో పక్క విద్యార్థి నిల్చున్నాడు. ఇద్దరి దగ్గరా వారి వారి ఆయుధాలు ఉన్నాయి. అప్పుడు ఆ విద్యార్థి భయాన్ని ఇలా అడిగాడు. నేను నీతో యుద్ధం చేయడానికి అనుమతి తీసుకోవచ్చా అన్నాడు. దానికి భయం, అనుమతి అడిగినందుకు దన్యవాదాలని చెబుతూ నామీద గౌరవం ఉన్నందుకు కృతజ్ఞుడిని అని చెప్పింది.

నేను నిన్నెలా జయించాలలి అని విద్యార్థి అడిగాడూ. అపుడు, భయం ఇలా అంది. నేను ముందుగా మాట్లాడతాను. నీ ముఖం ముందు నిల్చుంటాను. నువ్వు నా మాటలని వినడం మానేస్తే నాకెలాంటి శక్తి ఉండదు. నన్ను జయించాలంటే నా మాటలని వినకుండా ఉండాలి. నా నుండి దూరంగా ఉండాలనుకుంటే నా మాటలు నీ దగ్గరి వరకు రాకుండా చూసుకోవాలి. లేదా నా మాటలు వినకుండా ఉండాలి అని చెప్పింది. అప్పుడు విద్యార్థికి అర్థమైంది. భయాన్ని గెలవాలంటే ముందుగా దాన్ని అర్థం చేసుకోవాలనీ.

గురువు చెప్పిన పాఠం బాగా నచ్చింది. ఆ తర్వాత ఏ పని చేసినా భయం మాట వినకుండా పని మొదలెట్టాడు. జీవితంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...