మోదీ మెచ్చుకున్న ‘తిమ్మాయపల్లి’.. తెలంగాణలోని గ్రామమే.. దాని ప్రత్యేకత ఏంటంటే?

-

ఐదేళ్ల కింద ఆ ఊరి పరిస్థితి వేరేలా ఉండేది. ఆ ఊళ్లో భూగర్భజలాలు లేక తండా ప్రజలు నీటి కోసం అల్లాడేవారు. పక్క ఊళ్లోకి వెళ్లి తాగునీటిని కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇక.. పంటల కోసం నీరు ఎక్కడినుంచి వస్తుంది. సాగు నీరు లేక.. బోర్లు, బావులు ఎండిపోయి.. వలసలు పోయేవారు.

నిన్న ఆదివారం ప్రధాని మోదీ మన్‌కీబాత్ కార్యక్రమం జరిగింది కదా. ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ జల సంరక్షణ గురించి మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో నీటి సంక్షోభం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇంకో నాలుగు ఐదు ఏళ్లలో దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో తాగడానికి నీళ్లే దొరకవట. ఇంకో ఐదేళ్ల వరకే ఇండియాలో తాగడానికి నీళ్లు దొరుకుతాయట. భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయట. అందుకే.. ఇప్పటినుంచే అందరూ నీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని.. ప్రధాని మోదీ మన్‌కీబాత్‌లో వెల్లడించారు.

అయితే.. ఆయన జల సంరక్షణ గురించి మాట్లాడుతూ.. తెలంగాణలోని తిమ్మాయపల్లి గ్రామం గురించి చెప్పారు. ఆ గ్రామాన్ని ప్రశంసించారు. తిమ్మాయపల్లి తండా జలసంరక్షణ పనుల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రధాని కొనియాడారు. ఇంతకీ.. తిమ్మాయపల్లి తండా వాసులు.. జలసంరక్షణ కోసం ఏం చేశారో తెలుసా?

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వాళ్లు కుంటలు, ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఆ తండా జనాభా కేవలం 500 మాత్రమే. అయితే.. ఐదేళ్ల కింద ఆ ఊరి పరిస్థితి వేరేలా ఉండేది. ఆ ఊళ్లో భూగర్భజలాలు లేక తండా ప్రజలు నీటి కోసం అల్లాడేవారు. పక్క ఊళ్లోకి వెళ్లి తాగునీటిని కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇక.. పంటల కోసం నీరు ఎక్కడినుంచి వస్తుంది. సాగు నీరు లేక.. బోర్లు, బావులు ఎండిపోయి.. వలసలు పోయేవారు.

కానీ.. గత ఐదేళ్ల నుంచి వాళ్లు ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకొని.. గ్రామ శివారులో 4 ఊటకుంటలు, 4 చిన్న నీటి కుంటలు, గ్రామంలో తమ ఇండ్ల వద్ద 92 ఇంంకుడు గుంతలు నిర్మించుకున్నారు. అంతే కాదు.. తండ శివారులో 2 వేల కందకాలు తవ్వారు. దీంతో క్రమక్రమంగా ఆ ఊళ్లో భూగర్భ జలాలు వృద్ధి చెందడం స్టార్ట్ అయింది. దీంతో బోర్లు, బావుల్లో నీటి ఊట ప్రారంభం అయింది. దీంతో వలసలు తగ్గి.. ఊళ్లోనే చక్కగా వ్యవసాయం చేసుకుంటూ తండా వాసులు ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు మిషన్ భగీరథ కూడా రావడంతో ఆ తండా వాసుల తాగునీటి కష్టాలు కూడా తీరిపోయాయి. జల సంరక్షణ కోసం.. భూగర్భ జలాల కోసం ఆ తండా వాసులు చేసిన పనిని ప్రధాని మోదీ తెగ మెచ్చుకున్నారు. మన్‌కీబాత్‌లో తండా పేరు చెప్పి.. దేశమంతా ఆ తండాను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడంతో.. తండా వాసులు ఆనందంతో తబ్బిఉబ్బిబ్బవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news