సూటుబూటు వేసుకుని చాట్ బండి నడుపుతున్న కుర్రాళ్లు.. ఎందుకంటే..!

-

రోడ్డు పక్కన చాట్ బండి నడిపే వాళ్లు ఎలా ఉంటారు.. బాగా మాసిపోయిన బట్టలు, ఒళ్లంతా చెమట, పోగ అంతా ముఖం మీద పడి ఆగం ఆగం ఉంటారు కదా… అసలు చాలామంది ఓసీడి క్యాండిటెట్స్ కు పాపం ఆ చాట్, పానీపూరి తినాలి ఉన్నా.. అమ్మే వాళ్ల అవతారం నచ్చేకే వాటిజోలికి పోరు. కానీ అక్కడ చాట్ బండి నడిపేవాళ్లు.. సూటూబూటు వేసుకుని.. భలే హుందాగా పానీపూరీలు, పాపిడీ చాట్ లు అమ్మేస్తున్నారు. వీళ్లు ఇలా అమ్ముతుంటే అక్కడి వారంతా ఆశ్యర్యంగా చూస్తున్నారు. ఇప్పుడు ఈ కుర్రాళ్లు ఇలా సూటుబూటు వేసుకుని చాట్ అమ్మే వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
ఇద్దరు పంజాబీ యువకులు తమ డ్రెస్సింగ్ సెన్స్‌తో ఔరా అనిపిస్తున్నారు. రోడ్ సైడ్ బండికి హూందాతనాన్ని తీసుకొచ్చారు. పంజాబ్‌లోని మొహలీ రోడ్డుపై ఏర్పాటు చేసిన సింగ్ బ్రదర్స్ చాట్ బండిని చూస్తే ఎవరైనా సరే వారెవ్వా అనాల్సిందే.. వాళ్లు అవతారమే కాదు.. వాళ్లు చేసిన వెరైటీస్ కూడా భలే పసందుగా ఉంటుంది.

ఇంతకీ సూట్ ఎందుకు వేసుకున్నారు..?

ఇదేం బిజినెస్ ఐడియా కాదు.. పెద్ద కారణాలు కూడా లేవట. వీరు హోటల్ మేనేజ్మెంట్‌లో డిగ్రీని పూర్తి చేశారు. ఇంతకు ముందు వీరు ఓ స్టార్ హోటల్‌లో పనిచేశారట. కోవిడ్-19 వీరిపై కూడా ప్రభావం చూపింది. ఇంట్లో ఖాళీగా ఉండలేక ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. రోడ్డు పక్కన బండి పెడదామని ఎప్పుడో ఆలోచించారు. కానీ, ఇందుకు వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.. దీంతో తల్లిదండ్రులకు తెలియకుండా ఈ బండి నడిపేవారు.
ఇప్పుడు వారు.. ఆ బండికి ఈ కుర్రాళ్లు హుందాతనాన్ని తీసుకొచ్చారు. సూటు, బూటు వేసుకుని వివిధ రకాల చాట్‌లు, పానీపూరీ వంటి పంజాబీ వెరైటీలన్నీ తయారు చేసి విక్రయిస్తున్నారు. ‘‘సూట్ అనేది హోటల్‌మెనేజ్‌మెంట్‌కు సైన్. ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అందుకే ఇలా తయారై బండి నడుపుతున్నాం. త్వరలోనే చాట్ బండిని షాప్‌కు మార్చనున్నాం. ప్రస్తుతం పనులు జరగనున్నట్లు వాళ్లు తెలిపారు.
వీరి బండిపై చాట్, పాప్రీ చాట్, గోల్గప్పా, దహీ భల్లా వంటి ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉంటాయి. వీరి వీడియో చూసిన నెటిజన్లు వీళ్ల ఐడియా చూసి మెచ్చకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news