అందుకే నువ్వు క్రికెట్ లెజెండ్‌వి సచిన్.. వీడియో

-

సచిన్ టెండుల్కర్.. క్రికెట్ దేవుడు. క్రికెట్ లెజెండ్. అంతేనా.. కాదు.. ఇంకా చాలా ఉంది. ఆయన క్రికెట్‌కు వీడ్కోలు పలికాక ఆయనలోని మరో కోణం బయటకు వచ్చింది. సమాజ సేవ, ఇతర కార్యక్రమాలు, మోటివేషన్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ లాంటి ఎన్నో అంశాలపై ఆయన ఎప్పుడూ తన అభిమానులతో చర్చిస్తూనే ఉంటారు. తాజాగా దసరా సందర్భంగా అద్భుతమైన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు సచిన్. మనిషిలోని చెడు గుణాలైనటువంటి సోమరితనం, ద్వేషం, చెడు అలవాట్లు, కోపం, బాధ, ఈర్ష్య, అహంకారం, స్వార్థం.. ఇలా చెడు గుణాలను వదిలించుకోవాలంటూ వాటిని బెలూన్లపై రాసి ఒక్కో బెలూన్‌ను బాల్‌తో పగులగొట్టాడు. ఆ ట్వీట్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news