ఫొటోల‌కు న‌గ్నంగా పోజులిచ్చిన మ‌హిళా క్రికెట‌ర్‌.. త‌ప్పుగా అనుకోకండి.. మంచి ప‌నికే..!

బాలీవుడ్‌కు చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలే కాదు, గ‌తంలో ప‌లువురు అంత‌ర్జాతీయ సెల‌బ్రిటీలు కూడా మంచి ప‌నుల కోసం ఫొటోల‌కు న‌గ్నంగా పోజులిచ్చారు. అయితే ఇప్పుడు ఇంగ్లండ్‌కు చెందిన మ‌హిళా క్రికెట‌ర్ సారా టేల‌ర్ కూడా అదే బాట‌లో ఫొటో సెష‌న్‌లో పాల్గొంది.

బాలీవుడ్‌కు చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలే కాదు, గ‌తంలో ప‌లువురు అంత‌ర్జాతీయ సెల‌బ్రిటీలు కూడా మంచి ప‌నుల కోసం ఫొటోల‌కు న‌గ్నంగా పోజులిచ్చారు. అయితే ఇప్పుడు ఇంగ్లండ్‌కు చెందిన మ‌హిళా క్రికెట‌ర్ సారా టేల‌ర్ కూడా అదే బాట‌లో ఫొటో సెష‌న్‌లో పాల్గొంది. ఈ మేర‌కు ఆమె తాను న‌గ్నంగా దిగిన ఓ ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసింది. అయితే ఆమె ఈ ప‌ని చేయ‌డం వెనుక ఓ మంచి ఉద్దేశ‌మే ఉంది. అదేమిటంటే…

ఇంగ్లండ్ మ‌హిళా క్రికెట‌ర్ సారా టేల‌ర్ గ‌త కొంత కాలంగా ఆత్రుత చెంద‌డం అనే ఓ మాససిక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోంది. దీంతో ఆమె ఎక్కువ‌గా క్రికెట్ ఆడ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ ఆమె ప్ర‌స్తుతం స‌ర్రే స్టార్స్ త‌ర‌ఫున బాగానే క్రికెట్ ఆడుతోంది. అయితే త‌న‌లా ఎంద‌రో మ‌హిళ‌లు భిన్న‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని, వారంద‌రిలో చైత‌న్యం క‌లిగించాల‌ని, మ‌హిళ‌ల‌కు త‌మ దేహం ప‌రంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌నే ఉద్దేశంతోనే ఆమె తాజాగా న‌గ్నంగా ఫొటోషూట్ చేసింది.

అలా సారా టేల‌ర్ చేసిన ఫొటోషూట్‌కు చెందిన ఒ ఫోటోను ఆమె త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేయ‌గా ఇప్పుడు ఆ ఫొటో వైర‌ల్ అవుతోంది. అయితే ఈ విష‌యంపై ఆమె స్పందించింది. తాను ఒక మంచి ప‌నికోసం అలా న‌గ్నంగా వికెట్ల ముందు ఫొటోల‌కు పోజులిచ్చాన‌ని, అందులో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించింది. కాగా సారా టేల‌ర్ చేసిన ప్ర‌య‌త్నాన్ని ఇప్పుడు అంద‌రూ అభినందిస్తున్నారు.