కష్టం, నష్టం అంతా నువ్వే ఉండాలని చెప్పే స్టీవ్ జాబ్స్ మాటలు..

స్టీవ్ జాబ్స్ ( Steve Jobs ) : జీవితంలో విజయం సాధించాలనుకునే వారందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏదైనా ఉందటే, అది తమ తాము చేసుకోవాలన్న సత్యమే. అవును, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే విజయం అదే వస్తుంది. కొంత మంది ఉంటారు. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఇతరులు ఏమనుకుంటారో అని తెగ ఆలోచిస్తారు. అలా ఆలోచించడంలోనే సమయం గడిచిపోతుంది. అది ఎంత మాత్రమూ మంచిది కాదు. దానివల్ల మీ నైపుణ్యం దెబ్బతింటుంది.

 

Steve Jobs | స్టీవ్ జాబ్స్
Steve Jobs | స్టీవ్ జాబ్స్

గట్టిగా నిలబడండి. గర్వంగా ఉండండి. మీరేం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. మీ చేతలే మీ భవిష్యత్తు అని గుర్తుంచుకోండి. ఇతరులను ఎప్పుడూ జడ్జ్ చేయవద్దు. మీకు వారి గురించి పెద్దగా తెలియదు. అలాగే మిమ్మల్ని జడ్జ్ చేసే వాళ్ళని పట్టించుకోవద్దు. వాళ్ళకు మీ గురించి తెలియదు. మీ అభిప్రాయాలను నమ్ముతూ పని చేసుకుంటూ ముందుకు సాగిపోండి. ఇతరుల అభిప్రాయాలకు, నమ్మకాలకు విలువ ఇచ్చుకుంటూ పోతే మీ ఆనందం దూరం అవుతుంది.

ప్రతీ మనిషికీ వేరు వేరు రకాల అభిప్రాయాలు ఉంటాయి. అన్నింటికీ విలువ ఇచ్చుకుంటూ వెళ్తే నీ అభిప్రాయాలకు ఎవడు విలువ ఇస్తాడు. నీకు కలిసిన వాళ్ళందరూ వంద రకాల ఆలోచనలతో ఉంటారు. అందులో నుండి దేన్ని స్వీకరిస్తావు. అయినా అవన్నీ వాళ్ళకు నచ్చినవి. నువ్వేం చేస్తే వాళ్ళు హ్యాప్పీగా ఉంటారో అవే నీకు చెబుతున్నారు. కానీ నీ హ్యాపీనెస్ వాళ్ళకి అవసరం లేదు. ఆపిల్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ ఏమన్నాడో గుర్తు తెచ్చుకో.. నీకు చాలా తక్కువ సమయం ఉంది. ఈ సమయాన్ని వేరే వాళ్లలాగా బ్రతకాలని ఆలోచిస్తూ వృధా చేసుకోవద్దు.

నువ్వేం చేసినా అది నీదే. కష్టమైనా, నష్టమైనా ఏదైనా నీ నుండే రావాలి. డేర్ టు డూ మోటివేషన్ ఆధారంగా.