85 ఏళ్ల వయస్సులో కూడా తగ్గని జంట..బిజినెస్ లో లాభాలా బాట..

-

50 పైన వయస్సు ఉన్న వాళ్ళు ఈరోజుల్లో పని చెయ్యడం చాలా కష్టంగా వుంటుంది.. ఇక 85 ఏళ్ళు అంటే మాటలు కాదు..మంచానికి మాత్రమే అతుక్కుపోతారు..అలాంటిది బిజినెస్ చెయ్యడం అంటే మామూలు విషయం కాదు..అలాంటి సవాళ్లను ఎదుర్కొని ఓ వృద్ధ జంట ఇప్పుడు బిజినెస్ లో దూసుకు పోతున్నారు.ఈరోజు అందరికి ఆదర్సంగా నిలిచారు.. ఆ జంట సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గుజరాత్‌కు చెందిన ఓ వృద్ధుడు రిటైర్మెంట్ తర్వాత మరో వ్యాపారాన్ని ప్రారంభించారు..బిజినెస్ విజయవంతం కావడానికి చాలా కష్టాపడాలి అనుకున్నారు కానీ… రాత్రికి రాత్రే సక్సెస్ వచ్చింది. ఆ స్టార్టప్ అతనికి ఓవర్‌నైట్ సక్సెస్ అందించింది. అంతే… కొత్త కారు కొని సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు 85 ఏళ్ల ఆంట్రప్రెన్యూర్. ఇది ఆయన డ్రీమ్ కార్ మాత్రమే కాదు, తొలి కార్ కూడా పోస్ట్ రిటైర్మెంట్ స్టార్టప్ గురించి ఆయన రూపొందించిన వీడియో వైరల్‌గా మారింది.అది కాస్త వైరల్ అయ్యింది..

ఆయన పేరు రాధా క్రిషణ్ చౌదరీ. గుజరాత్‌కు చెందిన కురువృద్ధుడు. నానాజీగా పిలుస్తుంటారు. తన భార్య శకుంతలా చౌదరీతో కలిసి 2021 జనవరిలో అవిమీ హెర్బల్ పేరుతో ఆయుర్వేదిక్ హెయిర్ కేర్ బ్రాండ్‌ని ప్రారంభించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన తన కూతురితో కలిసి ఉంటున్నారు. 50 ఏళ్లపాటు కష్టపడ్డ తర్వాత కూడా స్టార్టప్ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. పోస్ట్ రిటైర్మెంట్ స్టార్టప్స్ నిర్వహించే బృందంలో చేరారు.

జుట్టు ఎక్కువగా రాలుతోందని తన కూతురు బాధపడుతుండటం చూసి హెయిర్ కేర్ బ్రాండ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అసలు జుట్టు రాలడానికి గల కారణాలేంటో పరిశోధించారు. 50 కి పైగా మూలికలతో తన స్వంత హెయిర్ ఆయిల్‌ను తయారు చేశారు..ఆ వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలు అయ్యింది..దాంతో లాభాల బాటకు బ్రహ్మ రథం పట్టారు.ఆ వృద్ధుడి విజయంలో అతని కుటుంబం పోషించిన పాత్రను గుర్తించడంతో, అతని స్టార్టప్‌ విజయానికి దోహదపడిన చివరి రెండు పాయింట్లు హార్ట్‌వర్క్‌. టీమ్‌ వర్క్‌ ఉంది. ఏదీ ఏమైనా విజయం సాధించాలంటే వయసు ముఖ్యం కాదని, పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు..కృషి,చేయాలనె తపన వుంటే సక్సెస్ అవ్వడం చాలా సులువు..నిజంగా హ్యట్సాప్..

Read more RELATED
Recommended to you

Latest news