మీ రోజుని స్మార్ట్ గా గడపడానికి కావాల్సిన ముఖ్యమైన విషయాలివే..

-

టీవీ చూస్తున్నప్పుడు అదే పనిగా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండకండి. దానివల్ల మన మెదడుకి పెద్దగా పని ఉండదు. కేవలం చూడడానికే తప్ప అందులో నుండి నేర్చుకోవడానికి పనిచేయకుండా పోతుంది. అందుకే మీకు పనికొచ్చే విషయాలని చూడడం అలవాటు చేసుకోండి.

టెడ్ టాక్ వంటి ప్రోగ్రామ్స్ ఫాలో అయితే బెటర్. జీవితంలో సాధించిన వారి జీవితాలు, అది సాధించడానికి వారు పడ్డ కష్టాలు కనిపిస్తాయి. మనకి స్ఫూర్తివంతంగా ఉంటాయి. ఏదైనా పనిచేయడానికి పనికొస్తాయి.

మీకు నచ్చినవే కాకుండా మీకు ఆసక్తిగా అనిపించిన విషయం పట్ల శోధించండి. ఇంటర్నెట్ లో దాని గురించి సమాచారం తెలుసుకోండి. రీసెర్చ్ అనేది మీకు చాలా పనికొస్తుంది.

చదవడం అనేది మెదడుకి మంచి మేతలా పనిచేస్తుంది. చదవడం వల్ల ఊహాశక్తి పెరుగుతుంది. అందుకే టీవీ చూడడం కంటే చదవడం చాలా ముఖ్యం. మనలో మనకి తెలియకుండానే ఊహాశక్తి డెవలప్ అవుతుంది. ముఖ్యంగా పిల్లలకి పుస్తకాలు చదవడం పట్ల పెద్దలే ఆసక్తి కలిగించాలి.

కొత్త భాష నేర్చుకోండి. భాష నేర్చుకుంటే ఆ భాషలో మాట్లాడే వాళ్ళు పరిచయ అవుతారు. అప్పుడు మీకు వివిధ భాషల, ఆచారాల సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అది మీకు మంచి ఆహ్లాదభావాన్ని కలిగిస్తుంది.

ఆన్ లైన్ లో చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మీకు కావాల్సినవి నేర్చుకుంటే బెటర్. సోషల్ మీడియా వాడకం బాగా తగ్గించి ఇలాంటి పనులకు సమయం కేటాయించండి.

కొత్త వారిని కలుసుకోండి. వారితో మాట కలపండి. దానివల్ల మీ కమ్యూనికేషన్ మెరుగవుతుంది. అలాగే మనుషులు ఎలాగుంటారో మీకు చూపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news