వీళ్ళు కుర్రాళ్లే..ఛాయ్ పెట్టడంలో మాస్టర్స్..లక్షల ఆదాయం..

-

చదువు సంస్కారం నేర్పిస్తుంది.ఎలా బ్రతకాలి, సమాజంలో పేరు పొందాలి అన్న విషయాలను నేర్పిస్తుంది..అయితే ఈ రోజుల్లో ఏటా చదివే వారి సంఖ్య పెరుగుతుంది..కానీ ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య మాత్రమే రోజు రోజుకు తగ్గుతుంది..కొందరు మాత్రం ఉద్యోగాల పై నమ్మకం లేక సొంత వ్యాపారాలు చేస్తూ సొంతంగా సంపాదిస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఏడాది వచ్చిన కొవిడ్ కారణంగా కళ్ల ముందే చాలా మంది తమ కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయారు. చాలా మంది లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలను కోల్పోయారు.

అయితే కొందరు దానిని కూడా తమకు అవకాశంగా మలుచుకుని, కొత్త కొత్త వ్యాపారాలతో నిలదొక్కుకున్నారు. ఓ ముగ్గురు కేరళ యువకులు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలపోవడంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి, విజయవంతంగా ముందుకు సాగుతున్నారు.వారి సక్సెస్ స్టోరీ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం పదండి..భారతదేశంలోని వేలాది మంది టెక్కీలలో కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన ఆనంద్, మహమ్మద్ షఫీ, అతని సోదరుడు షానవాస్ అనే ముగ్గురు యువకులు ఉన్నారు. తమ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ రోజుల్లో క్లాస్‌మేట్స్‌గా ఉన్న ఆనంద్, షఫీ లాక్‌డౌన్‌లో వారి ఉద్యోగాలను కోల్పోయారు. అంతకు ముందు కేరళలోని అనేక టెక్ కంపెనీలలో పని చేసిన అనుభవం వారికి ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన షానవాస్ లాక్‌డౌన్‌కు ముందు మిడిల్ ఈస్ట్, గుజరాత్‌లోని సంస్థలలో పనిచేశాడు.

లాక్‌డౌన్‌ పెట్టగానే ఉద్యోగాలు తక్కువగా లభిస్తుండడంతో వారు నిరాశపడ్డారు. అయితే కొంత కాలానికి వారు ఉద్యోగం కోసం అన్వేషణను ముగించి వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అలా పుట్టిందే ‘బీ టెక్ చాయ్’.. కొల్లాంలో జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో 2021 అక్టోబర్‌లో ఈ టీస్టాల్‌ను ప్రారంభించారు.ఇక్కడి ఛాయ్ మెనూలో అసోం టీ, మౌంటెన్ బటర్ టీ, డార్జిలింగ్ టీ, కశ్మీరీ కహ్వా వంటి 100కు పైగా రుచులు ఉండే టీలు ఉన్నాయి. వాటి ధర రూ.9 నుంచి మొదలై రూ.49 వరకు ఛార్జ్ చేస్తున్నారు. మొదట్లో వీరిని కుటుంబ సభ్యులే తిట్టారు. బాగా చదువుకుని టీ అమ్మడం ఏంటని నిలదీశారు. అయితే వారందరికీ తమ వ్యాపారాన్ని విజయవంతం చేసి, అంతా అవాక్కయ్యేలా చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ ఔట్‌లెట్‌లను వారు విస్తరిస్తున్నారు. రూ.1.5 లక్షలతో ప్రారంభించిన వీరి బిజినెస్ ప్రస్తుతం ఏడాదికి రూ.36 లక్షల టర్నోవర్ దాటింది..ఖర్చులు పోగా 15 లక్షలు అన్నా మిగులుతుందని చెబుతున్నారు..ప్రస్తుతం ఈ ఛాయ్ బ్రాంచ్ లను కూడా ఓపెన్ చేస్తున్నారు..ఇక నెక్స్ట్ కోట్లల్లో టర్నోవర్ ఉండినా ఆశ్చర్య పోనవసరం లేదు..చిన్న ఆలోచన, కాస్త కష్టం ఇప్పుడు వాళ్ళను ఈ స్థాయిలో ఉండేలా చేసింది..

Read more RELATED
Recommended to you

Latest news