రాజకీయాల్లో మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. ఎప్పుడు , ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఊహలకి కూడా అందవు. ఈ క్షణం తిట్టుకున్న వాళ్ళే మరుక్షణం ఆలింగనం చేసుకుని చెయ్యి చెయ్యి పట్టుకుని ఒక్కటే అనేట్టుగా కలిసిపోతారు. అసలు ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇంటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయట. మరో సారి ఆ ముగ్గురు జగన్ పై దండయాత్ర చేసేందుకు ఒక్కటి అవబోతున్నారని రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరగుతోంది.
అవి 2014 ఎన్నికలు జగన్ ఒక్కడే వన్ మెన్ ఆర్మీ గా ఎన్నికల్లో పోటీ చేపట్టాడు. కానీ జగన్ అనే “గన్” దూకుడుకి అడ్డుకట్ట వేసేందుకు, గెలుపు అవకాశాలు దెబ్బకొట్టేందుకు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఏకం అయ్యాయి. అయినా సరే అతి స్వల్ప తేడాతో జగన్ ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు జగన్ హవాని తట్టుకోలేక పోయాయి. అయితే తాజాగా జగన్ గెలుపు పై పంచనామా చేసుకున్న టీడీపీ అధినేత మూడు పార్టీలు ఏకం కాకుండా ఎవరికీ వారు పోటీ చేయడం వలనే జగన్ గెలుపు సాధ్యం అయ్యిందని తేల్చేశారట. దాంతో
వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు నేతలు కలిసి పోటీ చేయాలని 2014 సీన్ రిపీట్ చేయాలని తహతహలాడుతున్నారట. అందుకు అనుగుణంగా జగన్ సీఎం అయిన సమయం మొదలు, ఇప్పటి వరకూ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల అమలు, పని తీరులపై అసత్య ప్రచారాలు చేపట్టి జగన్ కి ప్రజలలో క్రేజ్ తగ్గించేందుకు భారీ పధకాన్ని రూపిందిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలాఉంటే ఒక వేళ పక్కా వ్యూహం ప్రకారం ఈ మూడు పార్టీలు జగన్ పై పై చేయి సాధించాలని అనుకున్నా సీట్ల సర్దుబాటు, సీఎం కుర్చీ ఎవరికి వెళ్తుందో లాంటి లావాదేవీలపై ఒక కొలిక్కి వచ్చిన తరువాత జగన్ పై ముప్పేట దాడి చేయడానికి ఆ మూడు పార్టీలు ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయపండితులు విశ్లేషిస్తున్నారు.