సంపద అంటే డబ్బొక్కటే కాదని చెప్పే అద్భుతమైన పాఠం..

Join Our Community
follow manalokam on social media

జీవితంలో అందరి కంటే ఎక్కువ డబ్బులు సంపాదించి, అందరి కంటే సుఖంగా ఉండడం అని అనుకుంటున్నారు చాలా మంది. నిజంగా సుఖంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. డబ్బు పెరుగుతున్న కొలది కోపాలు, చిరాకులు ఎక్కువ అవుతున్నాయి. ఆశ కూడా పెరుగుతుంది. ఇంకా కావాలి. ఇంకా కావాలి. ఇలా అనుకుంటూ ఎంత సంపాదించినా సుఖంగా ఉండని స్థితికి వచ్చేస్తున్నారు. డెబ్భై ఏళ్ళ వయసులో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి ఇరవై ఏళ్లకో, ముఫ్ఫై ఏళ్ళకో మా పిల్లలకి చేరతాయని సంబరపడడం ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి.

పిల్లలకి డబ్బివ్వాలి. కానీ ఎంత మేరకు. అమెరికాలో ఉన్నవాళ్ళు దేనికోసం వస్తారో తెలియదు. వచ్చి ఎన్నాళ్ళుంటారో తెలియదు. ఇక్కడ చెప్పేదేంటంటే, అమెరికా వెళ్ళకూడదనో, ఇక్కడే ఉండి పొలం పనులు చూసుకోవాలనో కాదు. దూరాలు పెరుగుతున్న కొద్దీ బంధాలు తగ్గిపోతున్నాయి. డబ్బొక్కటే కొలమానంగా మారిపోతుంది. ఎంత సంపాదిస్తే అంత పరువు, అంత ఆనందం అనుకుంటున్నారు. అసలు నిజమైన సంపద ఏంటి?

ఇంట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు నీ మదిలో ఒక జ్ఞాపకం కదిలి, అది నిన్ని చెక్కిలిగింతలు పెట్టిందంటే అంతకన్నా సంతోషం లేదు. ఏ పనీ చేయకుండా జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఉండాలా అని ఎదురు ప్రశ్న వేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, చాలా మంది నవ్వడం మర్చిపోతున్నారు. చిన్నప్పటి బాల్యాన్ని మర్చిపోతున్నారు. జీవితం కృత్రిమం అయిపోతుంది. ఫ్లాట్లు, ఖరీదైన బంగ్లాలు ఆస్తులు కూడబెట్టడమే జీవితం అనుకుంటున్నారు.

కానీ మోటివేషనల్ స్పీకర్ గౌర్ గోపాల్ దాస్ మాటల ప్రకారం, నీ కంట్లో కన్నీళ్ళు కారితే అది తుడవడానికి ఎన్ని చేతులు వచ్చాయనేదే నీ సంపద. జీవితం చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ లాంటిది. అది కరిగిపోయే లోపే ఆస్వాదించాలి. కరిగిపోతున్న కొవ్వొత్తి లాంటిది. అందరికీ వెలుగులని పంచాలి.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...