నువ్వెంత ప్రత్యేకమో తెలియకపోతే నీతో నువ్వు ఆనందంగా ఉండలేవని తెలుసుకో..

-

నువ్వు చాలా స్పెషల్. ఈ మాట అవతలి వాళ్ళు నీ గురించి మాట్లాడితే వినాల్సింది మాత్రమే కాదు. నీకు నువ్వుగా నీకోసం చెప్పుకోవాల్సిన మాట కూడా. ఎందుకంటే నువ్వు నిజంగా ప్రత్యేకమే కాబట్టి. ఈ అనంత విశ్వంలో ఎక్కడెక్కడ మనుషులున్నారో, మనుషుల్లాంటి వారున్నారో, మనకి తెలియని ప్రదేశాలెన్ని ఉన్నాయో తెలియదు. అన్ని ప్రదేశాలు ఉండగా ఈ భూమ్మీద మానవ రూపంలో నువ్వు జన్మించావు. అందుకు నువ్వు ప్రత్యేకం. భూమి మీద ఉన్న వందల కోట్ల మందిలో నువ్వు ఒకడివే కావచ్చు. కానీ ఈ విశ్వం మీద ఉన్న కోట్ల మందిలో నువ్వు ప్రత్యేకమే.

నీ దగ్గర డబ్బు లేదు కావచ్చు. తినడానికి తిండి కూడా లేదు కావచ్చు. అయినా కానీ నీకన్నా చాలా వెనకబడి ఉన్నా వారికంటే నువ్వు చాలా గొప్ప అనే విషయం తెలుసుకో. ఒక పని చేసావు. అది ఫెయిలైంది. నిరాశ పడ్డావు. దానివల్ల ఏమస్తుంది నీకు. ఈ జీవితం ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరం చెప్పలేం. మరి అలాంటి దానికి బాధ ఎందుకు. బాధపడి జీవితాన్ని అనుక్షణం మిస్ అవడం కంటే మరోసారి ప్రయత్నించడం గొప్ప. జీవితంలో ఏది చేయడానికైనా సమయం ఉంటుంది.

అవతలి వాళ్ళు చెప్పారని చెప్పి నిర్ణయాలు తీసుకోకుంటే జీవితం మన చేతుల్లో ఉండి మనం చెప్పినట్టుగానే నడుచుకుంటుంది. అలా కాకుండా వాళ్ళిలా అన్నారు, వీళ్ళిలా అన్నారని చెప్పి, మీరు చేయాల్సింది చేయకుండా మూలన కూర్చుని బాధపడడం వల్ల నష్టం నీకే. వారికేం తెలుసు నీ గురించి. నువ్వెంతటి వాడివో నీకే సరిగ్గా తెలియదు. అలాంటిది నీ గురించి అంచనా వేసే వాళ్ళు ఎవరున్నారు? జీవితంలో ఏది ఎదురచ్చినా, ఎన్నిసార్లు ఓటమి చవి చూసినా, గెలవడానికి ఎక్కడో ఒక మార్గం ఉంటూనే ఉంటుంది. అది కనిపెట్టడానికే నువ్వొచ్చావని అందుకే నువ్వు ప్రత్యేకమని అనుకుంటే అంతకన్నా ఆనందం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news