1600 కిలోమీటర్లు నడిచి వెళ్తే ఇంట్లోకి రావోద్దన్న తల్లి…!

-

కరోనా వైరస్ పుణ్యమా అని ఇప్పుడు మనుషుల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తినే పరిస్థితి నెలకొంది. కనీసం కన్న పిల్లలను కూడా తల్లి తండ్రులు పట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన చూస్తే కన్నీళ్లు పెట్టడం ఖాయం. ఈ సంఘటన వారణాసి లో జరిగింది… అసలు జరిగింది ఏంటీ అంటే… ముంబైలోని నాగ్‌పాడ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన…

అశోక్ కేసరి ఒక హోటల్ లో బాయ్ గా పని చేస్తున్నాడు. లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో పనులు లేక తన ఆరుగురు స్నేహితులతో కలిసి సరిగా 14 రోజుల పాటు… ఏకంగా 1600 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేసి… వారణాసి లోని సప్తసాగర్ లో తన ఇంటికి వెళ్ళాడు. కాని తల్లి మాత్రం తలుపులు తెరవడానికి ఇష్టపడలేదు. వారణాసి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళకుండా అశోక్… డివిజినల్ ఆస్పత్రికి వెళ్ళాడు.

వైద్యులు 14 రోజుల పాటు గ్రుహ నిర్భందంలో ఉండాలని చెప్పడంతో ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. కానీ తల్లి తలుపు తీయలేదు. దీనికి కారణం ముంబై లో కరోనా వైరస్ సోకింది అనే భయం తో ఆమె తలుపు తీయలేదు. దీనిపై మాట్లాడిన పోలీసులు… జిల్లా ఆసుపత్రిలో అశోక్ కు వైద్య పరీక్షలు చేసిన తర్వాత… ఇంట్లో ఉండడానికి కుటుంబ సభ్యులు వద్దు అన్నారని అందుకే ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేసామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news