18 వేల ఏళ్లనాటి శునక కళేబరం.. ఇంకా తాజాగానే ఉన్న‌శరీర భాగాలు..

-

రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని మంచు కింద 18 వేల ఏళ్ల నాటి మంచుయుగం శునక కళేబరం లభ్యమైంది. అత్యంత శీతల ప్రాంతంలో కప్పబడి ఉండడంతో దాని శరీరంలోని చాలా భాగాలు కుళ్లిపోకుండా ఇప్పటికీ తాజాగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ శునకానికి డోగర్ అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.

ఈ డోగర్.. తోడేళ్లు, నక్కలకు మధ్యస్త జాతికి చెందినదని అంచనా వేశారు. దీనికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన స్వీడన్ శాస్త్రవేత్తలు ఇది మగ కుక్కేనని తేల్చారు. రెండేళ్ల వయసులోనే అది మరణించి ఉంటుందని నిర్ధారించారు.

Read more RELATED
Recommended to you

Latest news