వయసులో పెద్దవారైనా ఆడవాళ్ళతో డేటింగ్ కి వెళ్ళే ముందు తెల్సుకోవాల్సిన సూచనలు.. 

ఇప్పుడు కాలం చాలా మారింది. దాంతో పాటు అన్నీ మారాయి. వయసులో పెద్దవారైన ఆడవాళ్ళతో  బంధం ఏర్పర్చుకోవడం సాధారణం అయిపోయింది. నిజానికి గతంలోనూ ఇలాంటివి జరిగినప్పటికీ, అప్పట్లో సోషల్ మీడియాలు,, వాట్సాప్ లు లేవు కాబట్టి ప్రపంచానికి పెద్దగా తెలిసేది కాదు. ఐతే వయసులో పెద్దవారైనా ఆడవాళ్ళతో డేట్ కి వెళ్ళాలనుకునేవారు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. లేదంటే మీ డేట్ మొదట్లోనే అంతమైపోవచ్చు.

వాళ్ళు మీకంటే తెలివైనవారు

వాళ్ళు మీ కన్నా జీవితాన్ని ఎక్కువ చూసారు కాబట్టి మీ కంటే ఎక్కువ తెలివి ఉంటుంది. అందుకే అనవసర పిచ్చి పిచ్చి వేషాలు వేయవద్దు. వారి జీవన విధానం, విలువలు వేరుగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంది.

మీ చేష్టలను జాగ్రత్తగా గమనిస్తారు

ముందుగానే చెప్పినట్టు మీ ప్రవర్తనా విధానం, చేష్టలు ఈజీగా పసిగట్టేస్తారు. దాని ద్వారా మీపై ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. టీనేజీ కుర్రాడి వేషాలు వేయవద్దు.

వయసు గురించి మాట్లాడవద్దు.

పొరపాటుగానైనా సరే వయసు గురించి అస్సలు డిస్కస్ చేయవద్దు. దానివల్ల అవతలి వారిలో అనవసర అనుమానాలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా, తమ గురించి మీ ఆలోచన విధానం ఎలా ఉందనేది గ్రహిస్తారు.

ఆమెని గుర్తించండి.

వయసులో పెద్దవారైనా కూడా వాళ్ళు కూడా ఆడవాళ్ళే. వాళ్ళకి కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అనిపించుకోవాలని ఉంటుంది. అప్పుడప్పుడు ప్రశంసిస్తూ వాళ్ళలోని ఆడతనాన్ని గుర్తించండి. అది వాళ్ళలో మంచి ఎనర్జీ ఇస్తుంది.

గతం గురించి మీకు అనవసరం

ఆమె జీవితం పెద్దది కాబట్టి వారి జీవితంలో ఎవరో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉండవచ్చు. వాళ్ళ గురించి మీకు అనవసరం. ఆ విషయం అడగకపోవడం ఇద్దరికీ మంచిది.