క‌రోనా పోరులో 99 ఏళ్ల తాత గారి సూప‌ర్ ఛాలెంజ్.. ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..!!

-

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల్లోనూ విళ‌య‌తాండ‌వం చేస్తుంది. చైనాలో పుట్టిన ఈ వైర‌స్ అనేక దేశాలు విస్త‌రించి ఎంద‌రో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను అన్యాయంగా బ‌లి తీసుకుంటుంది. ఇక దీని బాధితులు ల‌క్ష‌ల్లో ఉన్నారు. ముఖ్యంగా పెద్ద‌న్న‌గా చెప్పుకునే అమెరికా క‌రోనా దెబ్బ‌కు చిగురుటాకులా వ‌ణికిపోతోంది. ఈ మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట కాలు పెట్ట‌కుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు కూడా తీసుకుంటున్నాయి. లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు స్తంభించిపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి

ప్రపంచంలోని సగానికిపైగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల ప్రాణాలనే కాదు, వారి జీవనోపాధిని సైతం కరోనా చిన్నాభిన్నం చేసింది. రోజువారీ కార్మికులు, వలస కూలీల తిన‌డానికి తిండి లేక ప‌డుతున్న బాధులు ఎన్నో. అయితే ఇలాంటి వారిని ఆదుకునేందుకు సినీ తార‌లు, రాజ‌కీయ నాయ‌కులు, వ్య‌పార‌వేత్త‌లు.. ఇలా ఎంద‌రో త‌మ వంతు సాయం ప్ర‌భుత్వం ద్వారా పేద‌ల‌కు అందిస్తున్నారు. అయితే తాజాగా ఓ 99 ఏళ్ల తాత పేద‌ల కోసం ఓ వినూత్న ప్ర‌యోగం చేశాడు. ఈ క్ర‌మంలోనే గట్టి సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన 99 ఏండ్ల రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ టామ్ మూర్ (99) కరోనా బాధితుల వైద్యం కోసం విరాళాలు సేక‌రించాల‌ని భావించాడు. కానీ, బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి. మూర్‌కు రెండేండ్ల క్రితమే తుంటి ఎముక విరిగిపోయింది. ఊతకర్ర సాయంతో మాత్రమే నడువగలరు. అయిన‌ప్ప‌టికీ ఆయన తన నివాసం చుట్టూ 25 మీటర్ల దూరం ఏర్పరచుకున్న గార్డెన్‌లో 100 సార్లు నడవాలని డిసైడ్ అయ్యారు. ఏప్రిల్ నెలలోనే 100వ జన్మదినం జరుపుకోనున్న టామ్ మూర్ పుట్టిన రోజు నాటికి 100 రౌండ్లు తిరుగుతానని చాలెంజ్ చేశారు.

Veteran's garden walk raises $16M for UK health service - Midland ...

నా సవాల్‌కు స్పందించి కరోనా బాధితుల కోసం తోచినంత విరాళాలు ఇవ్వాలని సోష‌ల్ మీడియాలో ద్వారా పిలుపునిచ్చారు. ఇక మూర్ ఛాలెంజ్‌కు ఫిదా అయిన‌ నెటిజన్లు పెద్ద ఎత్తున ఆయనకు విరాళాలు అందచేశారు. దీంతో టామ్ మూర్ రూ. 100 కోట్లు ఆయన సేకరించారు. ఇక ముందుగా అనుకున్న‌ట్టే ఈ భారీ విరాళాన్ని కరోనా బాధితుల సహాయార్థం ఖర్చుచేయాలని ఎన్ హెచ్ ఎస్ సంస్థకు అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news