అభినందన్ కు 5 రకాల పరీక్షలు చేయనున్న సైన్యం.. ఎందుకోసమంటే?

-

పాకిస్థాన్ కు చిక్కిన ఐఏఎఫ్ పైలట్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి భారత్ కు తిరిగి వచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల ఒత్తిడి, భారత దౌత్యం ఫలించడంతో పాకిస్థాన్ అభినందన్ ను భారత్ కు పంపించక తప్పలేదు. వాఘా సరిహద్దు వద్ద ఆయన్ను పాక్.. భారత్ కు అప్పగించింది. అయితే.. పాకిస్థాన్ సైన్యం చేతిలో మూడు రోజుల పాటు బందీగా ఉన్న అభినందన్ నుంచి పాక్ ఎటువంటి ఆధారాలు రాబట్టింది అనే విషయాలపై ఇప్పుడు అధికారులు దృష్టి పెట్టారు. దేశ రహస్యాలను అభినందన్ నుంచి పాకిస్థాన్ తెలుసుకుందా? అభినందన్ వాళ్లకు ఎటువంటి విషయాలు చెప్పారు.. అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. దాని కోసమే అభినందన్ కు ఐదు రకాల పరీక్షలు చేయనున్నారట.

Abhinandan will have 5 types of tests to know his status

ముందుగా… పాక్ ఆర్మీకి అభినందన్ ఎలా పట్టుబడ్డాడో తెలుసుకుంటారు. పట్టుబడ్డ దగ్గర నుంచి భారత్ కు తిరిగి వచ్చే వరకు అక్కడ ఏం జరిగింది.. అనే విషయాలను ఆయన నుంచి తెలుసుకోనున్నారు.

తర్వాత.. ఆయన శారీరక సామర్థ్యం కోసం వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

అభినందన్ బాడీలో పాక్ ఏవైనా కంప్యూటర్ చిప్స్ లాంటివి పెట్టిందా? అని తెలుసుకోవడం కోసం అభినందన్ బాడీని పూర్తిగా స్కాన్ చేయనున్నారు.

తర్వాత.. అభినందన్ కు సైకలాజికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆయనపై ఏవైనా ప్రయోగాలు చేసి దేశ రహస్యాలను తెలుసుకున్నారా? లేక టార్చర్ పెట్టి దేశ భద్రతకు సంబంధించిన సున్నిత అంశాలు తెలుసుకున్నారా? అనే విషయాలను తెలుసుకోవడం కోసం ఆయనకు సైకలాజికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

తర్వాత ఐబీ, రా విభాగం అధికారులు అభినందన్ ను ప్రశ్నిస్తారు. పాకిస్థాన్ లో ఆయన ఎటువంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు. అక్కడ వాళ్లు ఆయన నుంచి ఏం సమాచారం రాబట్టారు. అభినందన్ వాళ్లకు ఏవైనా రహస్యాలు చెప్పాడా? అనే వాటిపై అధికారులు అభినందన్ ను ప్రశ్నిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news