నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్.టి.ఆర్ బయోపిక్ వచ్చిన సంగతి తెలిసిందే. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ బయోపిక్ రెండు పార్టులుగా వచ్చింది. ఎన్.టి.ఆర్ కథానాయకుడు సంక్రాంతికి రిలీజ్ అవగా.. మహానాయకుడు ఫిబ్రవరి 22న రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి. అంతకుముందు క్రిష్ చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సక్సెస్ అవడంతో ఈ బయోపిక్ బాధ్యత నుండి తేజ తప్పుకోగా క్రిష్ మీద పెట్టాడు బాలయ్య.
క్రిష్ ఈ సినిమాను అందరికి నచ్చేలా తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యాడు. ఇటీవల ఈ బయోపిక్ రెండు పార్టులను చూసిన నాగార్జున సినిమా వారు చెప్పాలనుకున్నంతవరకు బాగానే తీశారని అన్నాడట. అయితే మహానటి సక్సెస్ అయ్యినట్టు ఎన్.టి.ఆర్ బయోపిక్ ఎందుకు సక్సెస్ కాలేదో అర్ధం కాలేదని తన సన్నిహితులతో అన్నారట. ఇక ఎన్.టి.ఆర్ బయోపిక్ రిజల్ట్ చూశాక ఏయన్నార్ బయోపిక్ తీయాలన్న ఆలోచన మానుకున్నారు నాగార్జున. సినిమాగా కాకున్నా ఏయన్నార్ బయోపిక్ వెబ్ సీరీస్ గా ట్రై చేద్దామని అనుకున్నార్ట. కాని ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా వద్దనుకున్నట్టు తెలుస్తుంది.