బొద్దింకలు ఆరోగ్యానికి హానికరం..లేని రోగాలను తీసుకువస్తాయి..ఇంట్లో ఒక్కటి కనిపించిన వాటిని వెంటాడి మరీ చంపేస్తాము..ఎందుకంటే అవి వంటగదిలో ఆహారపదార్ధాలను నాశనం చేస్తాయి. అందుకనే ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే చాలు.. వెంటనే మార్కెట్లోకి పెస్టిసైడ్స్ కోసం పరిగెడతారు. అయితే ఒక అమెరికన్ కంపెనీ బొద్దింకలు విషయంలో చాలా విచిత్రమైన ఆఫర్‌ను అందిస్తోంది..ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే జనాలు నోర్లువెల్లబెడతారు..
ఇంట్లో వంద బొద్దింకలను పెంచే వారికి బంపఫర్ ఇస్తుంది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షన్నర రూపాయలను అందిస్తుంది.బొద్దింకలను పెంచడానికి ఒక కంపెనీ అంత డబ్బు ఎందుకు ఇస్తుంది అని ఆలోచిస్తున్నారా.. దీని వల్ల ఏమి ఉపయోగం? ఆ కంపెనీ ఎందుకు ఇలా బొద్దింకలు పెంచమని కోరుతుందనే విషయాల గురించి ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం.
నార్త్ కరోలినాలోని ఒక పెస్ట్ కంట్రోల్ కంపెనీ తన కొత్త ఔషధాన్ని పరిశోధిస్తోంది. ఈ పరిశోధనకు బొద్దింకలు చాలా అవసరం. పురుగులను నిర్మూలించడంలో ఇది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కంపెనీ ఆ బొద్దింకలపై మందును పరీక్షిస్తుంది. ఇందుకోసం కంపెనీ బొద్దింకలను పెంచుకునే ఇళ్లను వెతుకుతోంది. కంపెనీ ఆ ఇళ్లలో కనీసం 100 బొద్దింకలను విడుదల చేస్తుంది. ఆ బొద్దింకలనుకదలికలను కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంది.
ప్రతిఫలంగా కంపెనీ 2 వేల డాలర్లు అంటే దాదాపు 1 లక్షా 56 వేల రూపాయలను అంద జేస్తుంది.రీసెర్చ్ దాదాపు నెల వరకు ఉంటుంది. నెల తర్వాత ఇంట్లో బొద్దింకలు లేకుండా నివారిస్తే ఒకే..లేకుంటే ఇంట్లో మిగిలిపోయిన బొద్దింకలను తొలగించి ఆ ఇంట్లో మళ్లీ బొద్దింకలు లేకుండా చేస్తుంది. అయితే ఈ రీసెర్చ్‌లో బొద్దింకలను పెంచే ఇళ్లన్నీ అమెరికాలోనే ఉండాలని షరతు పెట్టింది.వామ్మో ఇదేం ఆఫర్ రా బాబు.. నెల రోజులు ఎంతమంది హాస్పిటల్ పాలవుతారో..