కేజీ గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిపోయిన ఇండియన్‌.. ఉరిశిక్ష విధించి కోర్టు

-

మన దగ్గర గంజాయి సరఫరా చేస్తూ దొరికిపోతే.. జైలుకు పంపిస్తారు.. ఉరితీసే అంత పెద్ద శిక్ష అయితే వేయరు కదా.. కానీ అక్కడ మాత్రం కేవలం ఒక్క కేజీ గంజాయి సరఫరా చేస్తూ దొరికిపోయాడని ఒక భారతీయుడికి ఉరిశిక్ష విధించి అక్కడి కోర్టు.. మీకు ఈ విషయం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా..! ఇంతకీ ఏ దేశంలో అనుకుంటున్నారా..స్ట్రిట్‌ రూల్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌.. సింగపూర్‌… ఇక్కడ ఎన్నో కఠినమైన చట్టాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే..! గంజాయి స్మగ్లింగ్ చేసి పట్టుబడిన ఓ నేరస్తుడికి ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. తీర్పు ఎప్పుడో వచ్చినా అమలులో జాప్యం జరిగింది.. అసలు ఈ మచ్చటేందో మీరు చూసేయండి..!

2014లో తంకరాజు సుప్పయ్య అనే 46ఏళ్ల వ్యక్తిని గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2018 అక్టోబర్ 9న ఉరిశిక్ష విధించింది సింగపూర్ న్యాయస్థానం. సింగపూర్ న్యాయస్తానం ప్రకారం.. కిలో కంటే ఎక్కువ గంజాయి తరలించకూడదు. ఆ నేరాన్ని చేసినందుకే తంకరాజు సుప్పయ్య మరణశిక్ష పడింది. శిక్షించడంలో ఎందుకు అంత జాప్యం జరిగిందో తెలుసా..?

తంకరాజు సుప్పయ్యకు 2018 అక్టోబర్ 9న ఉరిశిక్ష పడింది. అయితే..తంకరాజు సుప్పయ్య మరణశిక్షను అమలు చేయరాదని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ రంగంలోకి దిగింది. బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్, అనేక దేశాలు మరణశిక్షను వ్యతిరేకించాయి. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలైన నార్వే, స్విట్జర్లాండ్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో థంకరాజు శిక్షను రద్దు చేయాలని శిక్షను తగ్గించాలని యూరోపియన్ యూనియన్ సింగపూర్ అధికారులను కోరింది.. అయినా వినలే..

అయితే సింగపూర్‌లోని నేర న్యాయ వ్యవస్థలో మరణశిక్ష అనేది ఒక ముఖ్యమైన భాగమని సింగపూర్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. సింగపూర్‌ను సురక్షితంగా ఉంచడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రతతో దీన్ని అమలు చేస్తున్నట్లు సింగపూర్ హోం మంత్రిత్వ శాఖ వివరించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మరణశిక్ష విధించడం సింగపూర్ విధానమని హోంమంత్రి కె షణ్ముగం చెప్పుకొచ్చారు.. 87% మంది సింగపూర్ వాసులు మరణశిక్షను సమర్థిస్తున్నారు. మరణశిక్ష సింగపూర్‌కే పరిమితం కాదు. ప్రపంచంలోని మూడు అతిపెద్ద దేశాలైన చైనా, ఇండియా, యునైటెడ్ స్టేట్స్‌లో మరణశిక్ష అమలులో ఉందని కె షణ్ముగం చెప్పారు..

ఆరు నెలల విరామం తర్వాత సింగపూర్ ఉరిశిక్షలను మళ్లీ ప్రారంభించింది. ఈ ఏడాది ఉరిశిక్ష అమలు కావడం ఇదే తొలిసారి. ఇక ఉరిశిక్ష అమలు అయితే మాత్రం పాపం అతను ప్రాణాలు కోల్పోవాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news