మళ్ళీ జగ్గారెడ్డి ఆవేదన..హస్తంలో ఏం జరుగుతోంది?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తగ్గేలా లేవు…అంతా బాగుందనుకునే  సమయంలో పార్టీలో ఏదొక వివాదం వస్తూనే ఉంది. దీని వల్ల పార్టీ బలోపేతం అవ్వడం కష్టమవుతుంది. ఈ అంతర్గత విభేదాలతోనే కాంగ్రెస్ పార్టీకి పూర్తి డ్యామేజ్ జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి పి‌సిసి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి పార్టీ సీనియర్లు ఏదొక విధంగా రచ్చ లేపుతూనే ఉన్నారు.

మొదట రేవంత్ పి‌సి‌సి అధ్యక్షుడు అవ్వడం సీనియర్లకు ఇష్టం లేదు..అందుకే ఆయనకు చెక్ పెట్టాలని ఏదొక విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయనపై బహిరంగంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో రేవంత్ వర్గం సైతం సీనియర్లని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇలా ఇరు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ఎక్కడా కూడా సఖ్యత లేదు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే డ్యామేజ్ జరుగుతుంది. తాజాగా సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

గతంలో కూడా పలుమార్లు రేవంత్ టార్గెట్ గా జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం సర్ది చెప్పడంతో..తాను ఏం మాట్లాడనని చెప్పారు. కానీ తాజాగా మరోసారి ఆయన బయటకొచ్చి..గాంధీ భవన్ లో ప్రశాంతత లేకుండా పోయిందని అన్నారు. 5 నెలల నుంచి రాజకీయంగా గాంధీ భవన్‌కు రాలేని పరిస్తితి ఉందని, గాంధీ భవన్ లో కూర్చుని అన్నీ సమస్యలని మర్చిపోయిన రోజులున్నాయని, కానీ ఇప్పుడు ప్రశాంతంగా కూర్చునే పరిస్తితి లేదని అన్నారు.

గాంధీ కుటుంబం త్యాగాలు అంటే తనకు ఇష్టమని, ఆ పిచ్చితోనే కాంగ్రెస్ లో కొనసాగుతున్నానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులు నుంచి పార్టీలో అనేక మార్పులు వస్తున్నాయని, పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నానని, కానీ కొందరు అడ్డుపడుతున్నారని, బయటక చెప్తే ఏం అవుతుందో అని లోలోపల బాధపడుతున్నానని జగ్గారెడ్డి అన్నారు. మరి ఈయన ఎవరిని టార్గెట్ చేసుకుని అన్నారు..అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో అర్ధం కాకుండా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news